మలయాళ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో మోహన్ లాల్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో చాలా మూవీ లతో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని ఇప్పటికి కూడా మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే మోహన్ లాల్ కొన్ని సంవత్సరాల క్రితం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన జనతా గ్యారేజ్ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో మోహన్ లాల్ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండటంతో ఈ మూవీ ద్వారా మోహన్ లాల్ కి తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు కూడా వచ్చింది.

అలాగే మోహన్ లాల్ నటించిన అనేక సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలు కూడా సాధించడంతో తెలుగులో ఈయనకు మంచి క్రేజ్ ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా మోహన్ లాల్ "ఎంపురాన్" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దానితో ఈ మూవీ కి అడ్వాన్స్ బుకింగ్స్ తోనే కేరళ లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 10 కోట్లు కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చిన కలెక్షన్లను బట్టే అర్థం అవుతుంది ఈ సినిమాపై కేరళ ప్రేక్షకులు ఏ రేంజ్లో అంచనాలు పెట్టుకున్నారు అనేది. ఈ మూవీ కి మంచి టాక్ వచ్చినట్లయితే ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: