బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సల్మాన్ ఖాన్ కొంత కాలం క్రితం టైగర్ 3 అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో కత్రినా కైఫ్ హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. దానితో ఈ సినిమా పరవాలేదు అనే స్థాయి విజయాన్ని మాత్రమే అందుకోగలిగింది. ఇది ఇలా ఉంటే తాజాగా సల్మాన్ ఖాన్ తమిళ సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన సికిందర్ మూవీ లో హీరో గా నటించాడు.

మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి రష్మిక మందన , సల్మాన్ ఖాన్ కి జోడిగా నటించింది. ఈ మూవీ ని మరి కొంత కాలం లోనే విడుదల చేయనున్నారు. దానితో ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను కూడా ఈ మూవీ యూనిట్ పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తుంది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేశారు ... అలాగే ఈ మూవీ రన్ టైమ్ ను కూడా లాక్ చేశారు. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ రాగా , ఈ మూవీ 150 నిమిషాల 08 సెకండ్ లో నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని సల్మాన్ ఖాన్ "సికిందర్" మూవీ తో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: