టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారి లో అల్లు అర్జున్ ఒకరు . బన్నీ ఇప్పటి వరకు చాలా విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించాడు . కొన్ని సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో ఆర్య అనే మూవీ వచ్చిన విషయం మన అందరికీ తెలిసిం దే . ఈ మూవీ అల్లు అర్జున్ కెరీర్ లో రెండవ మూవీ గా వచ్చింది . భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా ఆర్య మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఆర్య మూవీ వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత ఆర్య 2 అనే టైటిల్ తో అల్లు అర్జున్ హీరో గా సుకుమార్మూవీ ని నిర్మించాడు.

సినిమా భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. కానీ ఈ సినిమా ఆర్య స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇకపోతే థియేటర్లలో ఈ సినిమా భారీ నిజాన్ని అందుకోకపోయినా ఈ సినిమాకు ఆ తర్వాత ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే కూడా ఈ సినిమా బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు చాలా మంచి "టి ఆర్ పి" రేటింగ్ ను తెచ్చుకుంటుంది. ఇకపోతే ప్రస్తుతం ఆర్య 2 మూవీ బృందం ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలి అని ఆలోచనలో ఉన్నట్లు , అందుకు సంబంధించిన పనుల కూడా ప్రస్తుతం వేగవంతంగా జరుగుతున్నట్లు , ఈ మూవీ ని ఏప్రిల్ 5 వ తేదీన రీ రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లో విలువడబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: