తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో నితిన్ ఒకరు. జయం మూవీ తో కెరీర్ను మొదలు పెట్టిన ఈయన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత కూడా కెరియర్ను మంచి దశలోనే ముందుకు సాగించాడు. ఈ మధ్య కాలంలో మాత్రం నితిన్ కు వరుస పెట్టి అపజయాలు దక్కుతున్నాయి. వరుసగా నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం , ఎక్స్ట్రా ఆర్డినరీ మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. తాజాగా నితిన్ "రాబిన్ హుడ్" అనే సినిమాలో హీరోగా నటించాడు.

శ్రీ లీలా ఈ మూవీ లో హీరోయిన్గా నటించగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించారు. వెంకీ కుడుములమూవీ కి దర్శకత్వం వహించగా ... ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ మూవీ లో ఓ కీలకమైన నటించాడు. రాజేంద్ర ప్రసాద్మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించగా ... జీ వి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని మార్చి 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర ప్రాణంతో నితిన్ వరుస పెట్టి ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటూ వస్తున్నాడు. ఇకపోతే నితిన్ ప్రస్తుతం తమ్ముడు అనే సినిమాలో కూడా హీరో గా నటిస్తున్నాడు. తాజాగా నితిన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా నితిన్ "తమ్ముడు" మూవీ గురించి సూపర్ సాలిడ్ అప్డేట్ ప్రకటించాడు.

తాజా ఇంటర్వ్యూ లో బాగంగా నితిన్ "తమ్ముడు" మూవీ గురించి మాట్లాడుతూ ... తమ్ముడు సినిమాకు సంబంధించిన దాదాపు మొత్తం షూటింగ్ పూర్తి అయ్యింది. ఆ సినిమాకు సంబంధించిన కేవలం ఒకే ఒక సాంగ్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఆ సాంగ్ ను కూడా వచ్చే నెల కంప్లీట్ చేస్తాం. తమ్ముడు సినిమాకు సంబంధించిన ట్రైలర్ను రాబిన్ హుడ్ సినిమా విడుదల అయిన తర్వాత ఒక వారం లేదా రెండు వారాలకు విడుదల చేస్తాం అని నితిన్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: