సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లకు అలాగే ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే అద్భుతమైన విజయాలను అందుకున్న బ్యూటీలకి అద్భుతమైన క్రేజ్ ఉంటూ వస్తుంది. స్టార్ హీరోయిన్లు ఇతర సినిమాలతో బిజీగా ఉన్న , కొన్ని కారణాల వల్ల స్టార్ హీరోయిన్ తీసుకోవాలి అని మూవీ బృందం అనుకున్న అది కుదరలేని పరిస్థితుల్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన స్థాయిలో కెరీర్ను కొనసాగిస్తున్న ముద్దుగుమ్మలను మూవీలలో హీరోయిన్లుగా ఎక్కువ శాతం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కెరీర్ను కొనసాగిస్తున్న పూజా హెగ్డే , రష్మిక మందన ను కొన్ని మూవీ బృందాలు హీరోయిన్గా అనుకున్న ఆఖరి నిమిషంలో వీరి స్థానంలో ఒక అప్ కమింగ్ బ్యూటీ ఆ సినిమాలలో హీరోయిన్గా నటించింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరు ..? ఏ సినిమాలో అవకాశాలను దక్కించుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.

మహేష్ బాబు హీరోగా కొంత కాలం క్రితం గుంటూరు కారం అనే సినిమా విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో మొదట పూజ హెగ్డేను హీరోయిన్గా అనుకున్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల పూజా హెగ్డేసినిమా నుండి తప్పుకోవడంతో ఆమె స్థానంలో ఆ మూవీలో యంగ్ బ్యూటీ శ్రీ లీల ను హీరోయిన్గా తీసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో కూడా పూజ హెగ్డే ను హీరోయిన్గా అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఈ సినిమాలో పూజా హెగ్డే ను కాకుండా శ్రీ లీల ను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు. ఇకపోతే నితిన్ తాజాగా రాబిన్ హుడ్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో మొదట రష్మిక మందనను హీరోయిన్గా అనుకున్నారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే సమయానికి ఆమె బిజీగా ఉండడంతో ఆమె స్థానంలో శ్రీ లీలను ఈ మూవీ లో హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు. ఇలా శ్రీ లీల ... పూజా హెగ్డే చేయవలసిన రెండు సినిమాల్లో , రష్మిక మందన చేయాల్సిన ఒక సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: