ప్రియదర్శి ప్రధాన పాత్రలో తాజాగా కోర్టు అనే మూవీ తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే. నాచురల్ స్టార్ నానిమూవీ ని నిర్మించాడు. లేకపోతే ఈ మూవీ కి అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ ఇప్పటికే భారీ కలక్షన్లను వసూలు చేసే అద్భుతమైన లాభాలను కూడా అందుకుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 10 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. మరి ఈ 10 రోజుల్లో ఈ సినిమాకు రోజు వారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ల వివరాలను , అలాగే మొత్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి ప్రీమియర్స్ మరియు మొదటి రోజుతో కలుపుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.68 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇక రెండవ రోజు ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.88 కోట్ల కలెక్షన్లు దక్కగా , 3 వ రోజు 3.05 కోట్లు , 4 వ రోజు 1.36 కోట్లు , 5 వ రోజు 1.35 కోట్లు , 6 వ రోజు 1.13 కోట్లు , 7 వ రోజు 1.12 కోట్లు , 8 వ రోజు 1.01 కోట్లు , 9 వ రోజు 1.57 కోట్లు , 10 వ రోజు 1.50 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే 10 రోజులు బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 17.65 కోట్ల షేర్ ... 30.35 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి విడుదల అయిన తర్వాత 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లు వచ్చాయి. ఆ తర్వాత ఈ మూవీ కి 8 వ రోజు వరకు కలెక్షన్లు స్టడీగా దక్కుతూ వచ్చాయి. ఇక 9 వ , 10 వ రోజు ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కలెక్షన్లు వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తే ఈ మూవీ కి మరికొన్ని రోజులు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లు వచ్చే అవకాశాలు చాలా వరకు కనబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: