తమిళ నటుడు విక్రమ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విక్రమ్ కొంత కాలం క్రితం పా రంజిత్ రూపొందిన తంగాలన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. కానీ ఈ సినిమాలో విక్రమ్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దానితో ఈ మూవీలోని విక్రమ్ నటనకు గాను ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకున్నాడు. ఇకపోతే విక్రమ్ తాజాగా వీర ధీర శూర అనే సినిమాలో హీరో గా నటించాడు.

మూవీ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ ని మార్చి 27 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల పరవాలేదు అనే స్థాయి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 4 కోట్ల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. దానితో ఈ సినిమా 4.50 కోట్ల టార్గెట్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే మార్చి 27 వ తేదీన ఈ సినిమాతో పాటు మోహన్ లాల్ హీరోగా రూపొందిన ఎంపురాన్ మూవీ విడుదల కాబోతుంది. అలాగే మార్చి 28 వ తేదీన మ్యాడ్ స్క్వేర్ , నితిన్ హీరోగా రూపొందిన రాబిన్ హుడ్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. కేవలం రెండు రోజుల్లోనే నాలుగు సినిమాలు విడుదల అవుతూ ఉండడంతో వీర ధిర శుర తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్మలాంజ్ కంప్లీట్ చేసుకొని హిట్ స్టేటస్ ను అందుకోవాలి అంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ టాక్ ని తెచ్చుకోవాలి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: