నితిన్ తాజాగా రాబిన్ హుడ్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి శ్రీ లీల ఈ సినిమాలో నితిన్ కి జోడిగా నటించగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ మూవీ లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ అయినటువంటి డేవిడ్ వార్నర్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఛలో , భీష్మ అనే మూవీలతో వరుసగా రెండు విజయాలను అందుకున్న వెంకీ కుడుమల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

మూవీ ని మార్చి 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు భారీ ఎత్తున ఈ సినిమాకి సంబందించిన ప్రచారాలను నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ వారు భారీ ఎత్తున ఒక ఈవెంట్ ను నిర్వహించి ఈ సినిమా యొక్క ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది.

ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించినట్లు , ఈ మూవీ మరో మూడు రోజుల్లో విడుదల కానున్నట్లు తెలియజేస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రస్తుతం ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి నితిన్ ఈ సినిమాతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: