నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ సంవత్సరం డాకు మహారాజ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి బాబి కొల్లి దర్శకత్వం వహించగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేశారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మంచి కలక్షన్లను వసూలు చేసి మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ఓ రికార్డును తాజాగా విడుదల అయిన కోర్టు అనే చిన్న సినిమా క్రాస్ చేసేసింది. మరి డాకు మహారాజ్ మూవీ కి సంబంధించిన ఏ రికార్డును కోర్టు మూవీ దాటేసింది అనే వివరాలను తెలుసుకుందాం.

ప్రియదర్శి ప్రధాన పాత్రలో రూపొందిన కోర్టు మూవీ ని నాచురల్ స్టార్ నాని నిర్మించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయ్యి అద్భుతమైన టాక్ ను తెచ్చుకొని ఇప్పటికే భారీ కలక్షన్లను వసూలు చేసి అద్భుతమైన లాభాలను అందుకుంది. ఇకపోతే బాలకృష్ణ హీరో గా రూపొందిన డాకు మహారాజ్ సినిమా వరుసగా 8 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇకపోతే తాజాగా విడుదల అయిన కోర్టు మూవీ ఏకంగా 10 రోజుల పాటు ఒక కోటి కంటే మించిన షేర్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసింది. ఇలా డాకు మహారాజు సినిమా కంటే కూడా కోర్టు మూవీ రెండు రోజులు ఎక్కువగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను వసూలు చేసి బాలయ్య మూవీ నే బీట్ చేసేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: