
మళయాళ ‘మార్కో’ విడుదల అయ్యేంతవరకు ఆమూవీ దర్శకుడు హనీఫ్ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే ఆమూవీ బ్లాక్ బష్టర్ హిట్ అవ్వడంతో ఒక్కసారిగా అతడి పేరు దక్షిణాది సినిమా రంగంలో మారుమ్రోగి పోయింది. 2017లో ‘ది గ్రేట్ ఫాదర్’ మూవీతో మళయాళ ఫిలిమ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఆతరువాత ‘రామచంద్ర బాస్ అండ్ కో’ అనే మూవీ కూడ చేశారు.
అయితే ఈ రెండు సినిమాలు హిట్ అయినప్పటికీ అతడి పేరు మళయాళ ఫిలిమ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అయింది. ఆతరువాత అతడు లేటెస్ట్ గా తీసిన ‘వయొలెన్స్’ మూవీ ‘మార్కో’ మళయాళ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా అది డబ్ కాబడ్డ తెలుగు తమిళ భాషలలొ బ్లాక్ బష్టర్ హిట్ అయి దాదాపు 200 వందల కోట్లు కలక్షన్స్ రావడంతో అతడి పేరు ఒక్కసారిగా దక్షిణాది సినిమా రంగంలో మారుమ్రోగి పోతోంది. ఇప్పడు ఈ దర్శకుడుతో సినిమా చేయడానికి అనేకమంది ప్రముఖ నిర్మాతలు క్యూ కడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈలిస్టులో ఇప్పుడు దిల్ రాజ్ ముందు వరసలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం దిల్ రాజ్ కుమార్తె నిర్వహిస్తున్న ఒక ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై ఈమూవీని భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు లీకులు వస్తున్నాయి. అంతేకాదు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈమూవీ ప్రాజెక్ట్ లో దిల్ రాజ్ కు సహ నిర్మాతగా వ్యవహరించే ఆస్కారం ఉండి అని అంటున్నారు.
సాధారణంగా దిల్ రాజ్ సినిమాలో విపరీతమైన హింస ఉండదు. హనీఫ్ తీసే మూవీలలో విపరీతమైన హింస ఉంటుంది. దీనితో దిల్ రాజ్ ఈ దర్శకుడుతో తీసే మూవీ కోసం తన పద్దతిలో మార్పులు చేసుకుంటాడా అన్నసందేహాలు కొందరిలో ఉన్నాయి. అయితే ఈసినిమాలో నటించబోయే పాన్ ఇండియా స్థాయిగల టాప్ హీరో ఎవరు అన్న విషయమై రకరకాల హీరోల పేర్లు వినిపిస్తున్నాయి..