
ఇప్పటికే ప్యారడైజ్ మూవీలో రెండు జడలు వేసుకుని పూర్తి మాస్ లుక్ తో కనిపించిన నాని లుక్ వైరల్ గా మారిన నేపధ్యంలో ఈమూవీ షూటింగ్ ప్రారంభం కాకుండానే అంచనాలు పెరిగాయి. ఈమూవీ షూటింగ్ ప్రారంభం కాకుండానే ఈమూవీని వచ్చే సంవత్సరం మార్చి 26 ‘ఉగాది’ పండుగ సందర్భంగా విడుదల చేస్తున్నట్లు ఒక సంవత్సరం ముందుగా నాని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు.
ముఖ్యంగా ఈప్రకటన రామ్ చరణ్ వ్యూహాలకు చెక్ పెట్టే విధంగా ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈమూవీలో జాన్వీ కపూర్ శివరాజ్ కుమార్ జగపతిబాబు టాప్ నటీనటులు నటిస్తున్నారు. వాస్తవానికి ఈసినిమాను అక్టోబర్ లో రాబోతున్న దసరా ను టార్గెట్ విడుదలచేయాలని భావించారు.
అయితే కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ కు క్యాన్సర్ రావడంతో ఆయన తన వైద్యం నిమిత్తం తరుచూ అమెరికా వెళ్ళివస్తూ ఉండటంతో ఈమూవీ షూటింగ్ అనుకున్న రీతిలో ముందుకు సాగడంలేదు అన్న ప్రచారం జరుగుతోంది. దీనితో ఈమూవీని సంక్రాంతికి విడుదల చేయాలని భావించినప్పటికీ ఆడేట్ కు చిరంజీవి అనీల్ రావిపూడిల మూవీ విడుదల అయ్యే ఆస్కారం ఉండటంతో చరణ్ సినిమాను వచ్చే సంవత్సరం ఉగాదికి విడుదల చేయాలి అని భావించినట్లు తెలుస్తోంది. ఈవిషయాన్ని పసిగట్టిన నాని చరణ్ తన సినిమా డేట్ ను ప్రకటించకుండానే చాల ముందుగా ప్రకటించి చరణ్ కు ఊహించని షాక్ ఇచ్చాడు అనుకోవాలి..