
ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు రాజేంద్రప్రసాద్ డేవిడ్ వార్నర్ పైన చేసిన వ్యాఖ్యలు అభిమానులను మనసు నొప్పించేలా చేశాయి. రేయ్ వార్నర్ దొంగ ముండా కొడుకు అంటూ వార్నింగ్ ఇవ్వడంతో అభిమానులు చాలా ఫీలయ్యారట. అలాగే రా బిన్ ఫుడ్ వంట చిత్రాలు చాలా చేయాలి అని వెంకీ లాంటి డైరెక్టర్ తో మళ్ళీ నటించాలని తెలిపారు రాజేంద్రప్రసాద్. దీంతో సోషల్ మీడియాలో రాజేంద్రప్రసాద్ ని ట్రోల్ చేస్తూ ఉండడంతో తాజాగా తను మాట్లాడిన వ్యాఖ్యలపైన స్పందించాడు రాజేంద్రప్రసాద్.
తనకు డేవిడ్ వార్నర్ అంటే చాలా ఇష్టమని ఆ తాను ఆడేటువంటి క్రికెట్ కూడా ఇష్టపడతానని డేవిడ్ వార్నర్ మాతో కలిసి సినిమా షూటింగ్లో చాలా సరదాగా గడిపామని తెలిపారు. అతనికి కూడా తన యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని తెలిపారు. నాకు తెలిసి మేము చాలా క్లోజ్ అయ్యాం అంటూ తెలియజేశారు రాజేంద్రప్రసాద్.. కానీ తను మాట్లాడిన వ్యాఖ్యలు మి మనసును బాధ పెట్టినట్లు అయితే క్షమించండి తాను ఉద్దేశపూర్వకంగా ఎవరిని అనినవి కాదు అంటూ తెలియజేశారు. సరదా చేసిన వ్యాఖ్యలే అవి అంటే తెలియజేశారు రాజేంద్రప్రసాద్. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ క్షమాపణలు చెబుతూ షేర్ చేసిన వీడియో కూడా వైరల్ గా మారుతున్నది.