తమిళ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడుగా పేరుపొందిన భారతి రాజా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే.. ఈయన సీతాకోకచిలుక సినిమా తెలుగులో దర్శకత్వం వహించి ఉత్తమ చిత్రం గా కూడా అవార్డుని అందుకున్నారు. అలాగే మంగమ్మగారి మనవడు సినిమాకి కూడా స్టోరీని అందించి మంచి క్రేజీ సంపాదించారు. అలా ఎన్నో చిత్రాలకు కూడా స్క్రీన్ ప్లే అందించిన భారతీయ రాజా తన కెరియర్లో ఎన్నో అవార్డులను కూడా అందుకోవడం జరిగింది. అయితే తాజాగా డైరెక్టర్ భారతి రాజా ఇంట విషాద ఛాయలు ఏర్పడ్డాయి.


డైరెక్టర్ భారతి రాజకుమారుడు మనోజ్ భారతి రాజా ఇటీవలే కన్ను మూసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈయన వయసు 48 సంవత్సరాలు.. భారతి రాజకుమారుడు మనోజ్ మరణానికి కారణం కార్డియాక్ అరెస్టు వల్ల చెన్నైలో ఆసుపత్రిలో ఈయన చికిత్స పొందుతూ ఉన్నారట. అయితే గడిచిన కొన్ని నిమిషాల క్రితం తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. అయితే మనోజ్ భారతి రాజాకు గడిచిన నెల రోజుల క్రితమే ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా జరిగినట్లు సమాచారం.మనోజ్ భారతి రాజా కూడా తాజ్ మహల్, అల్లి అర్జున్ తదితర చిత్రాలలో కూడా నటించారట. మనోజ్ భారతి రాజా మరణ వార్త విషయం తెలిసి అటు భారతి రాజా అభిమానులు, పలువురు సినీ సెలబ్రిటీలు సైతం తీవ్ర దిగ్బ్రాంతికి గురవుతున్నారు.



మనోజ్ భారతి రాజా కూడా తన తండ్రి అడుగుజాడలలో అనుసరిస్తూ దర్శకత్వం వైపుగా అడుగులు వేస్తూ ఉండేవారట. అలా 2023లో తన తండ్రి నిర్మించినటువంటి మార్గాలి తింగల్ అనే చిత్రానికి కూడా దర్శకత్వం వహించారట. ఈ సినిమా పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ ఆ తర్వాత అవకాశాలు పెద్దగా సంపాదించుకోలేకపోయారట మనోజ్ భారతి రాజా. ప్రస్తుతం ఈ విషయం అటు తమిళ ఇండస్ట్రీని తీవ్ర  దిగ్రాంత్ కి గురిచేస్తోంది. మరి ఈయన అంత్యక్రియలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: