ఈ మధ్యకాలంలో ఎన్నో రకాల సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అందులో కొన్ని సినిమాల్లో బ్లాక్బస్టర్ విజయాలను అందుకున్నాయి. అలాంటి వాటిలో చావా సినిమా ఒకటి. హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం చావా. మరాఠా రాజు చత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. చత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో, హీరో విక్కీ కౌశల్ అద్భుతంగా నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 14, 2025వ తేదీన థియేటర్లలో విడుదలైన సంగతి తెలుస్తుంది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.


చరిత్రలో చాలామందికి తెలియని ఓ గొప్ప మహారాజ్ శంబాజీ గురించి ఈ సినిమాలో ఎంతో చక్కగా చూపించారు. ఇందులో విక్కీ కౌశల్ హీరోగా చేయగా.... రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో రష్మిక మందన వరుసగా సినిమాలు చేసుకుంటూ ఆగ్ర హీరోయిన్ గా తన హవాను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీ హీరోయిన్ గా తన లైఫ్ కొనసాగిస్తోంది.


ఇక ఈ సినిమాలో అక్షయ్ కన్నా కీలకపాత్రను పోషించారు. చావా సినిమాకు లక్ష్మణ్ ఉడేకర్ దర్శకత్వం వహించగా.... మడాక్ ఫిలిమ్స్ కు చెందిన దినేష్ విజన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా శివాజీ సావంత్ మరాఠీ నవల చావా ఆధారంగా రూపొందించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది.


చావా సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను త్వరలోనే పార్లమెంట్ లో ప్రదర్శిస్తారని వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు, ఎంపీలు, కేంద్ర మంత్రులు హాజరవుతారని సమాచారం అందుతోంది. అంతే కాకుండా నటుడు విక్కీ కౌశల్ క్యాస్ట్ అండ్ క్రూ వస్తారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా స్క్రీనింగ్ డేట్ పై స్పష్టత రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: