
ప్రస్తుతం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో సమానంగా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల మీద కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రతి వారం థియేటర్లలో, ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ వారం సినీ ప్రియులకు పండగానే చెప్పాలి. అలాగే ఉగాది పండుగ కానుకగా రిలీజ్ అయ్యే ఈ సినిమాల లిస్ట్ చూద్దాం.
నెట్ ఫ్లిక్స్ వేదికగా జువెల్ థీఫ్- ది హైస్ట్ బిగిన్స్ సినిమా మార్చి 27న రిలీజ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ లో జకీర్ ఖాన్ డేలులు ఎక్స్ ప్రెస్ సినిమా మార్చి 27న విడుదల కానుంది. 28న శబ్దం సినిమా, 29న మలేనా సినిమా స్ట్రీమింగ్ అవ్వనున్నాయి. హాట్ స్టార్ లో ముఫాసా: ది లయన్ కింగ్ సినిమా మార్చి 26 నుండి స్ట్రీమింగ్ అవ్వనుంది. 28న ఓం కాళీ జై కాళీ సినిమా విడుదల అవ్వనుంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన జీ5లో మజాకా, విడుదల పార్ట్ 2, సెరుప్పుగల్ జాకిరతై సినిమాలు ఈ నెల 28న విడుదల కానున్నాయి. అలాగే మిలియన్ డాలర్ సీక్రెట్, ఎక్ట్స్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ సినిమాలు విడుదల కానున్నాయి. 28న డెన్ ఆఫ్ థీవ్స్ 2, అగత్య సినిమాలు స్ట్రీమింగ్ అవ్వనున్నాయి. ఇప్పటికే మిస్టర్ హౌస్ కీపింగ్ సినిమా విడుదల అయ్యింది. ఇంకెందుకు ఆలస్యం వెళ్లి వీక్షించండి.