డైనమిక్ హీరో మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మంచు మోహన్ బాబు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి పరిచయమైన మంచు విష్ణు తన సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అతి చిన్న వయసులోనే సినిమాలకు పరిచయమైన మంచు విష్ణు ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఈ మధ్యకాలంలో విష్ణు చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ అందుకోలేకపోతున్నాయి. అంతేకాకుండా విష్ణు కూడా సినిమాలలో పెద్దగా నటించడం లేదు.



బిజినెస్ లు, స్కూల్ వ్యవహారాలు చూసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఇక  సమయం దొరికినప్పుడల్లా ఏదో ఒక సినిమాలో మాత్రమే నటిస్తున్నారు. చాలాకాలం తర్వాత విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా తీసిన సంగతి తెలిసిందే. కన్నప్ప సినిమాలో మంచు విష్ణు, మోహన్ బాబు, ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్ ఇంకా ఎంతోమంది ప్రముఖ నటీమణులు ఈ సినిమాలో నటించారు. అవా ఎంటర్టైన్మెంట్స్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు ఈ సినిమాను నిర్మించగా... ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. 25వ తేదీన కన్నప్ప సినిమాను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

 
సినిమా రిలీజ్ కు కేవలం నెలరోజుల సమయం మాత్రమే ఉండడంతో కన్నప్ప సినిమా చిత్ర బృందం ప్రమోషన్స్  కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ కార్యక్రమాలను నిర్వహించగా.... రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్ లో కన్నప్ప టీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘుబాబు మాట్లాడుతూ కన్నప్ప లాంటి సినిమాలలో నటించే అవకాశం రావడం చాలా అదృష్టం అని మాట్లాడారు. కన్నప్ప సినిమా చాలా అద్భుతంగా చేశామని చెప్పారు. విష్ణు బాబు ఈ సినిమాతో గొప్ప స్థాయికి ఎదుగుతారని అన్నాడు. 

సినిమా సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుందని ఈ సినిమా చాలా బాగుంటుందని రఘుబాబు అన్నారు. భక్తకన్నప్ప సినిమాని ఎవరైనా ట్రోల్ చేసినట్లయితే సాక్షాత్తు శివుడు ఆగ్రహానికి గురవుతారని, శివుడి కోపానికి గురవుతారంటూ రఘుబాబు అన్నారు. అంతేకాకుండా ట్రోల్ చేసిన వారు శివుడి ఆగ్రహానికి, శాపానికి గురై ఫినిష్ అయిపోతారంటూ రఘుబాబు సంచలన కామెంట్లు చేశారు. ప్రస్తుతం రఘుబాబు చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్లపై కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తే.... మరి కొంత మంది నెగిటివ్ గా కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: