
అక్కినేని కోడలు నటి శోభిత ధూళిపాళ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిన్నది మోడలింగ్ తో తన కెరీర్ ప్రారంభించింది. అనంతరం సినిమాల మీద ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి హీరోయిన్ గా పరిచయమైంది. తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిన్నది వరుసగా సినిమాలు చేసుకుంటూ తెలుగు సిని ఇండస్ట్రీలో దూసుకుపోయింది. ఇక రీసెంట్ గానే అక్కినేని నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా కాలం నుంచి సీక్రెట్ గా వీరి రిలేషన్ కొనసాగించిన శోభిత, చైతు కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వారి వివాహాన్ని జరుపుకున్నారు.
వివాహం అనంతరం సినిమా షూటింగ్ లలో ఇద్దరు బిజీగా ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే ఈ జంట వారి హనీమూన్ ట్రిప్ ని ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే శోభిత, చైతు పిల్లలను కణాలని అనుకుంటున్నారట. వివాహం తర్వాత చైతు మంచి సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు. తండేల్ సినిమాలో హీరోగా చేసిన చైతు తనదైన నటనతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. అత్యంత ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాగా ఈ చిత్రం నిలిచింది. శోభిత రాకతోనే చైతుకి మంచి సక్సెస్ వచ్చిందని అభిమానులు, కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. ఇక ప్రస్తుతం నాగచైతన్య తన తదుపరి సినిమా గురించి ఆలోచనలో ఉన్నారట.
కానీ శోభిత మాత్రం వివాహం తర్వాత ఇప్పటివరకు ఎలాంటి సినిమాలలో నటించలేదు. మళ్ళీ ఎప్పటిలాగే సినిమాలు చేస్తుందా లేక తన పూర్తి సమయాన్ని కుటుంబానికే కేటాయించుతుందా అనే సందేహంలో అభిమానులు ఉన్నారు. ఇక వివాహం తర్వాత శోభిత ఏదో ఒక వార్తతో నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు. శోభితను ఏదో ఒక రకంగా అభిమానులు ట్రోల్ చేస్తున్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది.
ఇదిలా ఉండగా.... ప్రస్తుతం శోభితకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది. ఓ తెలుగు హీరో తనని వివాహం చేసుకోవాలని అనుకున్నారట. ఆ విషయాన్ని శోభితకు చెప్పగా అప్పటికే చైతన్యతో రిలేషన్ కొనసాగిస్తున్నానని మేము వివాహం చేసుకోవాలని అనుకుంటున్నామని శోభిత చెప్పడంతో ఆ హీరో పక్కకు తప్పుకున్నారట. ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది.