ప్రస్తుతం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో సమానంగా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల మీద కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రతి వారం థియేటర్లలో, ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఓటీటీలు వచ్చినప్పటినుండి చాలా మంది థియేటర్ కి వెళ్లి సినిమాలు చూడడం మానేశారు. ఈ వారం థియేటర్ లలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అలాగే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కూడా చాలానే సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా.. ఒక సూపర్ హిట్ మలయాళం రొమాంటిక్ కామోడీ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. లిజు తోమాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన అన్పోడు క‌న్మ‌ణి సినిమా ఓటీటీలో ఆడుతుంది. అన్పోడు క‌న్మ‌ణి లో అర్జున్ అశోకన్ హీరోగా నటించారు. అర్జున్ కి జోడీగా నటి అనఘా నారాయణన్ నటించింది. ఈ సినిమాకు సామ్యూల్ అబే సంగీతం అందించారు. అన్పోడు క‌న్మ‌ణి మూవీలో అల్తాఫ్ ఆస్లామ్‌, మాలా పార్వ‌తి ముఖ్యపాత్రలలో కనిపించారు. ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీ సామాజిక కట్టుబాట్లకు నలిగిపోయే ఓ జంట కథ. ఇది ఒక మంచి రొమాంటిక్ కామెడీ సినిమా. జనవరిలో థియేటర్ లలో రిలీజ్ అయిన అన్పోడు క‌న్మ‌ణి సినిమా తాజాగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యింది.

 
సినిమా ఒక మంచి మెసేజ్ ని ఇస్తుంది. అన్పోడు క‌న్మ‌ణి మూవీ ఐఎమ్‌డీబీలో 8.8 రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ మూవీ నేడే రిలీజ్ అయ్యింది. ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. వెంటనే వెళ్లి చూసేయండి. అన్పోడు క‌న్మ‌ణి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలక్షన్స్ ని రాబట్టింది. ఇక ఇప్పుడు ఓటీటీలో కూడా దూసుకెళ్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: