
అలా ఇప్పుడు తాజాగా సీనియర్ నటిగా పేరు పొందిన సుహాసిని కూడా ఇదే విషయాన్ని తెలియజేసింది. 1990లో స్టార్ హీరోయిన్గా ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాలు నటించిన ఈమె ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాలను నటిస్తూ ఉన్నది. తెలుగులోనే కాకుండా దక్షణాది భాషలలో కూడా నటించిన హీరోయిన్ సుహాసిని ఇటీవలే ఒక ఇంటర్వ్యూకు హాజరై పర్సనల్ ప్రొఫెషనల్ విషయాలను కూడా తెలియజేసింది. ఈ సమయంలోనే తనకున్న అనారోగ్య సమస్యలను బయట పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
హీరోయిన్ సుహాసిని కి టీబీ సమస్య ఉన్నదని తెలియజేసింది. అయితే ఈ విషయాన్ని భయంతో తాను అందరి దగ్గర దాచాను అని పరువుపోతుందని భయపడిపోయానని కానీ ఎవరికి తెలియకుండా తాను ఆరు నెలల పాటు చికిత్స తీసుకున్నానని ఆ తర్వాత ఈ విషయాన్ని సమాజానికి తెలిసేలా అందరిలా అవగాహన కల్పించేలా టీబీ గురించి చెప్పుకొచ్చానంటూ తెలియజేసింది సుహాసిని. తనకు ఆరు సంవత్సరాల వయసులోని టీవీ సమస్య బయటపడిందని ఆ తర్వాత కొద్ది రోజులకు అంత ఓకే అనుకున్నాను మళ్ళీ 36 ఏళ్ల వయసులో తనకు ఇది తిరగబడిందని తెలియజేసింది. దీనివల్ల తాను బరువు తగ్గిపోయానని వినికిడి సమస్య కూడా అప్పుడే తనకు మొదలయ్యిందని తెలియజేసింది. ఆ తర్వాత నెమ్మదిగా ఈ సమస్య తగ్గుముఖం పట్టిందని వెల్లడించింది.