
దర్శకుడు అనిల్ రావిపూడి తన స్టైల్ ఆఫ్ కామెడీతో ప్రేక్షకులను మరోసారి కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధం అవుతున్నాడు.. ఇటీవల అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల అయి భారీ విజయం సాధించింది.. ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. మాస్ కంటెంట్ కి తనదైన శైలిలో కామెడీని జత చేసి దర్శకుడు అనిల్ రావిపూడి భారీ హిట్స్ అందుకుంటున్నాడు..ఇప్పుడు చిరంజీవితో చేయబోయే చిత్రం కూడా అదే స్థాయి లో భారీ విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు..
ఈ సినిమా పూజా కార్యక్రమం ఉగాది రోజున జరగనుంది. ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానుంది. సంక్రాంతి 2026 లో విడుదల కానుందని సమాచారం. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గరపాటి నిర్మిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం తో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు..