సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఎప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటుంది.ఈ మధ్యనే ధనుష్ సినిమాకి సంబంధించి వివాదంలో ఇరుక్కున్న నయనతార ఆ తర్వాత కొద్ది రోజులకే మళ్లీ స్టేజ్ మీద మీనాని అవమానించి మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురైంది. అయితే మీనాతో ఇష్యూ మరువక ముందే మరోసారి నయనతార కి సంబంధించి ఓ వివాదం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. నయనతార తన పొగరుతో డైరెక్టర్ తో గొడవ పెట్టుకుందని,చివరికి డైరెక్టర్ సినిమా నుండి హీరోయిన్ ని తీసివేసి కొత్త హీరోయిన్ ని పెట్టుకోవాలి అనే ఆలోచనలో ఉన్నట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ నయనతార చేసిన తప్పేంటి..ఎందుకు డైరెక్టర్ తో గొడవ పెట్టుకుంది అనేది ఇప్పుడు చూద్దాం..

ఆర్జే బాలాజీ డైరెక్షన్లో మూరకుత్తి అమ్మన్ అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా తెలుగులో అమ్మోరుగా వచ్చి తెలుగులో కూడా హిట్ అయింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా మూకుత్తి అమ్మన్ -2 అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్ గా ఆర్జే బాలాజీ తప్పుకోవడంతో సుందర్ సి దర్శకత్వ భాద్యతలు తీసుకున్నారు. ఇషారి.కె.గణేష్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ తో నయనతారకు చిన్న గొడవ జరిగింది. సినిమాలో వేసుకునే కాస్ట్యూమ్ విషయంలో నయనతార అసిస్టెంట్ డైరెక్టర్ తో కాస్త కఠినంగా మాట్లాడంతో పాటు అవమానించడంతో ఇది కాస్త డైరెక్టర్ సుందర్ దాకా చేరిందట.ఇక నయనతార ప్రవర్తన నచ్చని డైరెక్టర్ సుందర్ సి నయనతారకి వార్నింగ్ ఇచ్చారట.

 ఎవరితో ఎలా మసులుకోవాలో మొదట నేర్చుకో అని వార్నింగ్ ఇవ్వడంతో నయనతార కాస్త హర్ట్ అయ్యిందట. ఇక సుందర్. సి కూడా ఈమెతో సినిమా చేసేదేలే అని షూటింగ్ పూర్తిగా వాయిదా వేశారట. అంతేకాదు నయనతార ప్లేస్ లో మరో హీరోయిన్ ని తీసుకొని మళ్లీ రీ షూట్ చేయాలి అని నిర్ణయం తీసుకున్నారట.అయితే ఈ విషయం మొత్తం తెలిసిన నిర్మాత డైరెక్టర్ హీరోయిన్ మధ్య తారస్థాయిలో గొడవలు ఉన్నాయని గ్రహించి రంగంలోకి దిగి చివరికి ఇద్దరి మద్య ఉన్న గొడవని క్లియర్ చేశారట. ఇక ఇషారి కే గణేష్ జోక్యంతో నయనతార డైరెక్టర్ సుందర్ సి ఇద్దరు కాంప్రమైజ్ కి వచ్చినట్లు తెలుస్తోంది. కానీ నయనతార  ఇప్పటినుండి అందరి మీద నోరు పారేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలని డైరెక్టర్ నిర్మాతతో చెప్పించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మూకుత్తి అమ్మన్-2 మూవీకి సంబంధించిన షూటింగ్ చెన్నైలోని ఓ ప్రముఖ దేవాలయంలో జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: