మలయాళం లో సూపర్ స్టార్ గా పేరుపొందిన మోహన్ లాల్, డైరెక్టర్ గా ,నటుడుగా పేరు సంపాదించిన పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం L2 ఎంపురాన్.. ఈ చిత్రం గతంలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న లూసీ ఫర్ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కించారు. ఈ నెల 27న ఈ సినిమా  భాషలలో విడుదల కాబోతున్నది. మంజు వారియర్, టోవినో థామస్, అభిమన్య సింగ్, తదితర నటీనటులు ఇందులో నటిస్తూ ఉన్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారట.


ఇలాంటి సమయంలోనే ప్రమోషన్స్ లో భాగంగా మోహన్ లాల్ ఇంటర్వ్యూలో పాల్గొంటూ మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం పైన కూడా పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. మలయాళం లో తాను నటించిన చాలా చిత్రాలు ఇతర భాషలలో డబ్బింగ్ చేయబడ్డాయి అలాగే లూసీ ఫర్ సినిమా కూడా డబ్బింగ్ తెలుగులో గాడ్ ఫాదర్ గా తీయడం జరిగింది.అయితే ఒరిజినల్ సినిమా  స్టోరీలోని కొన్ని మార్పులు చేసి ఆ చిత్రాన్ని తెరకెక్కించారని తెలిపారు.


అయితే మొదటి భాగంలో ఉన్న కొన్ని పాత్రలు తెలుగులో రీమిక్స్ చేసినప్పుడు కనిపించలేదు. అందుకే ఇప్పుడు వస్తున్న L2 ఎంపురాన్ సినిమా ఆధారంగా గాడ్ ఫాదర్ -2 చిత్రాన్ని వారు తెరకెక్కించలేరు అంటూ తెలియజేశారు. మరి చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలాగే ఈ సినిమాను కూడా సీక్వెల్ గా చేస్తారా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గతంలో కూడా గాడ్ ఫాదర్ సినిమాని రీమేక్ చేసినప్పుడు కూడా చిరంజీవి లుక్స్ పైన, డ్రెస్సింగ్ పైన కూడా చాలా ట్రోలింగ్స్ జరిగాయి. సినిమా కూడా ఒక మోస్తారులోనే ఆడినట్టుగా కనిపిస్తోంది. మరి ఇలాంటి సమయంలో సీక్వెల్ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: