సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫేవరెట్ ఫుడ్ అనేది ఉంటుంది . అది హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు ప్రొడ్యూసర్లు కావచ్చు ..సామాన్య జనాలు కావచ్చు స్టార్ సెలబ్రెటీస్ కావచ్చు .. ఆ విషయంలో ఎవరు కాంప్రమైజ్ కారు.  కాంప్రమైజ్ అవుతూ అసలు ఉండలేరు . తమకంటూ ఒక ఫేవరెట్ ఫుడ్ పర్సనల్గా ఇష్టపడుతూ ఉంటారు . అయితే చాలామంది నాన్ వెజ్ ..బిర్యానీ..  చికెన్..చికెన్ మంచూరియా .. దమ్ బిర్యాని .. తందూరి ఇలాంటివి ఇష్టపడుతూ ఉంటారు .


స్టార్ హీరోస్ హీరోయిన్స్ అయితే మరింత స్థాయిలో వెస్ట్రన్ కల్చర్ ఫుడ్ ..ఇటాలియన్ ఫుడ్ ని లైక్ చేస్తూ ఉంటారు . కానీ హీరోయిన్ అనుష్క శెట్టి దగ్గరకు వెళ్లి మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అంటే మాత్రం పెరుగ అన్నం - ఆవకాయ అంటూ చెప్పుకొస్తుంది . ఆమెకు మొదటి నుంచి కూడా అలాంటి ఫుడ్ అంటేనే ఇష్టమట . బయట రెస్టారెంట్ లో దొరికే ఫుడ్ కన్నా స్టైలిష్ ఫుడ్ కన్నా ఇండియన్ హెల్దీ ఫుడ్ అంటే చాలా చాలా ఇష్టమట . ఈ విషయాన్ని స్వయాన అనుష్క శెట్టి ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది . దాంతో జనాలు ఫుల్ షాక్ అయిపోతున్నారు.



ప్రెసెంట్ అనుష్క శెట్టి నటించిన "ఘాటి" సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది . అంతేకాదు మరొక యంగ్ హీరో సినిమాలో కూడా అనుష్క శెట్టి కీలకపాత్ర లో నటించబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కాగా అనుష్క శెట్టి గురించి అందరికీ తెలిసిందే . కెరియర్ పిక్స్ లో ఉండగానే ఆమె తీసుకున్న కొన్ని డెసిషన్ ఆమెను నెగిటివ్ గా ట్రోలింగ్  కి గురి అయ్యేలా చేశాయి . ఇప్పుడిప్పుడే మళ్ళీ ఇండస్ట్రీ లోకి వచ్చేసెటిల్ అవుదాం అనుకుంటుంది అనుష్క శెట్టి. చూడాలి మరీ ఆమె తన టాలెంట్ తో ఇంకెన్ని ఆఫర్స్ దక్కించుకుంటుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: