బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్ కి సౌత్ లో కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఈ ముద్దుగుమ్మకి దేశవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు ఉంది. అలా హిందీ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన కరీనాకపూర్ తనకంటే వయసులో చాలా పెద్దవాడైన సైఫ్ అలీఖాన్ ని ప్రేమించి పెళ్లాడింది. అయితే సైఫ్ కి అంతకుముందే పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయం తెలిసినా కూడా కరీనాకపూర్ పెళ్లి చేసుకుంది. ఇక రీసెంట్గా సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన కత్తి దాడికి సంబంధించిన కేసు ఎంత పెద్ద వైరల్ అయిందో చెప్పనక్కర్లేదు. ఈ విషయం పక్కన పెడితే.. కరీనాకపూర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మీరు ఈ ప్రపంచంలో ఉన్న ఎవరితో డేట్ చేయాలి అనుకుంటున్నారు అని ఒక ప్రశ్న ఎదురవగా చెబితే వివాదాస్పదం అవుతుంది కావచ్చు కానీ నేను ఓ పొలిటీషియన్ తో డేటింగ్ చేయాలి అనుకుంటున్నాను. 

ఆయన ఎవరో కాదు రాహుల్ గాంధీ.నాకు రాహుల్ గాంధీ పై అప్పట్లో ప్రేమ కలిగింది. ఆయనతో డేటింగ్ చేయాలి పెళ్లి చేసుకోవాలి అని కూడా అనుకున్నాను.అందుకే ఆయన రోజువారి దినచర్య ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకున్నాను. అలాగే ఆయన రాజకీయ కుటుంబానికి చెందిన వాడు నేను సినిమా నేపథ్యం నుండి వచ్చాను కాబట్టి మా రెండు కుటుంబాల మధ్య ప్రేమ పెళ్లి అనే ఆసక్తి పుట్టడానికి ఆస్కారం ఉంది.అందుకే నేను ఆయనతో డేట్ చేయాలి అనే కోరిక నాలో ఉండేది. కానీ అది కుదరలేదు అంటూ కరీనాకపూర్ రెండెజౌస్ విత్ సిమీ గ్రే వాల్ అనే పాపులర్ టీవీ షోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయట పెట్టింది.

అయితే ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన కొద్ది రోజులకు మళ్ళీ ఈ విషయం గురించి మాట్లాడుతూ మా ఇద్దరి ఇంటిపేర్లు ఇండియాలో బాగా పాపులర్..కాబట్టి ఈ విషయాన్ని అలా చెప్పాను అంటూ కరీనా కపూర్ చెప్పుకొచ్చింది. అలా రాహుల్ గాంధీని కరీనాకపూర్ ఇష్టపడిందని అలాగే రాహుల్ గాంధీ కూడా కరీనాకపూర్ ని ఇష్టపడ్డారని, ఇందిరా గాంధీకి కపూర్ ఫ్యామిలీ నుండి తమ ఇంటికి కోడలుగా ఎవరైనా ఒక అమ్మాయిని తెచ్చుకోవాలి అని ఇష్టం ఉండేదనే వార్తలు కూడా అప్పట్లో వినిపించాయి

మరింత సమాచారం తెలుసుకోండి: