
ఆ మూవీ మరేంటో కాదు "దసరా". నాని కెరియర్ ని ఈ సినిమా మలుపు తిప్పింది అనే చెప్పాలి. ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . నానిలోని ఒక డిఫరెంట్ యాక్టర్ ని బయట పెట్టింది . ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ నటించింది. చాలా డీ గ్లామరస్ లుక్ లో నటించి మెప్పించింది. కీర్తి సురేష్ నటన గురించి ఎంత పొగిడిన తప్పులేదు. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీలను ముందుగా అనుకున్నారట డైరెక్టర్.
కానీ ఆమె ఆఫర్ ని సున్నితంగా రిజెక్ట్ చేసిందట . ఆ తర్వాత మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ ని అప్రోచ్ అయ్యారట. అలా కీర్తి సురేష్ వద్దకు ఈ రోల్ వెళ్లగా ఆమె ఓకే చేసి సెన్సేషన్ హిట్ తన ఖాతాలో వేసుకుంది . కీర్తి సురేష్ ని జనాలకు మరింత దగ్గర చేసింది ఈ సినిమా అని చెప్పాలి. అంత మంచి సినిమా శ్రీలీల ఒప్పుకోకుండా చాలా చాలా తప్పే చేసింది . కీర్తి సురేష్ చాలా టాలెంట్ పర్సన్..ఈ సినిమా ఒప్పుకొని తన రేంజ్ మార్చుకునేసింది మహానటి కీర్తి సురేష్..!