సినిమా రిలీజ్ కి ముందు టీజర్ , ట్రైలర్ , పాటలకు ఎంత హైప్‌ క్రేజ్ వచ్చిన .. ఈ రోజుల్లో ఒకటే ఫలితం నిర్ణయిస్తుంది అనేది కొందరి వాదన .. అదే బుక్ మై షో ! ‘ఇంటరెస్టింగ్’ కౌంట్ ఎక్కువగా ఉంటే హిట్ తక్కువ ఉంటే ప్లాఫ్ అని తేల్చేసే సమయం ఇది .. అయితే ఇది నిజంగా జరిగిందా లేక ఎక్కడైనా మనుపులేషన్ జరిగిందా ? అనే డౌట్స్ మాత్రం చిత్ర పరిశ్ర‌మ‌లో గట్టిగా వినిపిస్తున్నాయి .. ప్రధానంగా మిడిల్ రేంజ్ కంటెంట్ బెస్ట్ సినిమాలు సరేనా స్పందన రాకపోవడం తో నిర్మాతలో అసంతృప్తి బలంగా కనిపిస్తుంది.. బుక్ మై షో యాప్ లో వోటింగ్ ఇంట్రెస్ట్ ఫీచర్స్ పై వస్తున్న ఆరోపణల ప్రకారం  బాట్స్ ద్వారా లైక్స్ కౌంట్స్ క్రియేట్ చేస్తున్నారని కామెంట్స్ వస్తున్నాయి .. 


అయితే టికెట్ బుక్ చేయిన్ని యూజర్లు కూడా ఓటింగ్ చేయగలటం వలన నిజమైన ఆడియన్స్ స్పందన ద్వారా కాకుండా ఇక్కడ ఫేక్ ట్రెండ్లు గట్టిగా కనిపిస్తున్నాయని కొంతమంది వాదిస్తున్నారు . ఇక నిర్మాతలు ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్న , గిల్టులో ఉన్న పెద్ద నిర్మాతలు మాత్రం మౌనంగా ఉండటం కొత్త అనుమానాలకు దారితీస్తుంది .. నిజానికి బుక్ మై షో ఇండస్ట్రీలో మల్టీప్లెక్స్‌లు , థియేటర్లు డైరెక్ట్ షేర్లు ఉన్నట్టు తెలుస్తుంది .  అంతేకాకుండా కొందరు నిర్మాతలు బుక్ మై షో నుంచి భారీ పెట్టుబడి వచ్చినట్టు ఇండస్ట్రీలో గట్టి చర్చ జరుగుతుంది .. అయితే ఇదే నిజమైతే ఈ యాప్ పై బహిరంగంగా స్పందించడం కొందరికి డేంజర్ అలెర్ట్ గా మారి అవకాశం కూడా ఉంది .. ప్రధానంగా రీసెంట్గా ఓ స్టార్ హీరో నిర్మాణంలో ఉన్న ఓ మల్టీప్లెక్స్  ప్రాజెక్టులో బుక్ మై షో 20 కోట్లు పెట్టుబడి చేసినట్లు టాక్ గట్టిగా నడిచింది ..


ఇక ఈ మొత్తం వ్యవహారంపై నిర్మాతల గిల్డ్ నుంచి అధికారికంగా ఎటువంటి స్పందన రాకపోవటం అసలు సమస్యగా తయారైంది . అయితే నిర్మాత నాగ‌ వంశీ లాంటి కొంతమంది మాత్రమే వాక్ అవుట్ చేసినట్టు తెలుస్తున్న మిగిలిన వారంతా బుక్ మై షో పనితీరిపై అసలు దృష్టి పెట్టడం లేదు .. అయితే ఇండస్ట్రీలో ఆధిపత్య వ్యవస్థ ఉందనే విమర్శలు కూడా ఉన్నాయి .. సామాన్య ప్రేక్షకుడి కోసం ఆన్లైన్ టికెట్ బుకింగ్ అనేది సులభతరం చేసిన , ఇప్పుడు అదే వ్యవస్థ సినిమాల ఫలితాలను ప్రభావితం చేసే సమస్యగా మారడం ఆరోగ్యకరమైన పరిణామం కాదని  పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి .. ఇప్పుడైనా  నిర్మాతలకు గిల్డ్ అధికారికంగా ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపి సరైన మార్గదర్శకాలు తీసుకోవాలని వారిపై ఒత్తిడి పెరుగుతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: