
మరీ ముఖ్యంగా ఉదయ్ కిరణ్ ని లవర్ బాయ్ అంటూ అమ్మాయిలు ముద్దుగా పిలుచుకునే వాళ్ళు . ఆయన నటించిన సినిమాలోని పోస్టర్స్ ఏదైనా పేపర్లో వచ్చినప్పుడు ఆ పేపర్ కటింగ్స్ ను బుక్స్ లో పధిలంగా దాచుకునే వాళ్ళు. అందులో స్టార్ హీరోల కూతుర్లు కూడా ఉన్నారు అని చెప్పుకోవడంలో సందేహం లేదు . అయితే అలాంటి ఒక క్రేజీ స్థానం సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ ఎలా మరణించాడు అనేది అందరికీ తెలిసిందే . అయితే ఉదయ్ కొరణ్ మరణించిన తర్వాత అలాంటి క్రేజీ స్థానం అందుకున్నది మాత్రం విజయ్ దేవరకొండ నే చెప్పాలి . .
రౌడీ హీరో అంటూ జనాలు ముద్దుగా పిల్చుకుంటారు. ఇండస్ట్రీలో ఎంతోమంది పాన్ ఇండియా హీరోలు ఉన్నారు . కానీ విజయ్ దేవరకొండ పేరు చెప్తే మాత్రం అమ్మాయిలు ఓ రేంజ్ లో బెల్లం చుట్టూ ఈగలు లా వాలిపోతూ ఉంటారు. విజయ్ దేవరకొండ కనిపించగానే అమ్మాయిలు అందరూ అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు . ఉదయ్ కిరణ్ తర్వాత అలాంటి క్రేజీ స్ధానం అందుకున్న హీరోగా విజయ్ దేవరకొండ మాత్రమే అని చెప్పాలి. ఆ ప్లేస్ లో అలా నిలిచిపోయాడు అంతే. ..!