రౌడీ హీరో విజయ్ దేవరకొండ నుంచి వస్తున్న కొత్త మూవీ కింగ్డమ్ ఫై రోజురోజుకీ భారీ అంచనాలు క్రేజ్‌ పెరిగిపోతుంది .. గౌతమ్‌ తిన్నూరి దర్శ‌క‌త్వంలో వస్తున్న ఈ సినిమా టీజర్ కు ముందు పెద్దగా ఎవరు పట్టించుకోలేదు కానీ టీజర్ తర్వాత కేజిఎఫ్ లాంటి ట్రీట్ ఉంటుందని చెప్పకనే చెప్పేసింది .. అలా అప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించుగాక మేకింగ్ పై ఆసక్తిని పెంచేసింది .. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీం శ్రీలంక వెళ్ళటం అక్కడ ఓ స్పెషల్ సాంగ్ షూట్ చేయటం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది .


అయితే రీసెంట్గా పాట షూట్ సాధారణ షూటింగ్ కాదని తెలుస్తుంది .. సినిమాను కీలక మలుపు ఇక్కడినుంచి మొదలవుతుందట మొత్తం ఐదు రోజులు పాటు జరిగే ఈ షెడ్యూల్లో శ్రీలంక పాపులర్ లొకేషన్ లో షూటింగ్ చేయబోతున్నారు .. ప్రధానంగా టూరిజం స్పాట్స్ ప్రదేశాలైన కూడా కథలో భాగంగా ఓ ఇంటెన్స్ నేరేషన్ కి నేపథ్యంగా ఉంటాయని తెలుస్తుంది .. అయితే ఈ పాటలో మీకింగ్ తో పాటు కథనంలోని కీలక పరిణామాలను హైలైట్ చేసే ప్రయత్నం కనిపించబోతుందని టాక్ . ఇక ఇప్పటికే ఈ సినిమా కథకు 1980లో జరిగిన శ్రీలంక సివిల్ వార్ కు కనెక్షన్ల ఉంటాయని ప్రచారం జరుగుతుంది . ఇక విజయ్ దేవరకొండ ఓ రెబ్బల్‌ పాత్రలో కనిపించబోతున్నాడు . అలాగే ప్రజల పక్షాన పోరాడే పాత్రలో అతడు మిలిటరీ శక్తులకు ఎదురు నిలిచే దీరుడుగా కనిపిస్తాడని తెలుస్తుంది ..


కాస్ట్యూమ్స్, ఆర్ట్ డిజైన్, మిలిటరీ బేస్డ్ లొకేషన్లు చూస్తే ఈ వాదనకు బలం కలుగుతుంది . ఒక సాధారణ మనిషి అగైనెస్ట్ సిస్టంపై దర్శకుడు గౌతమ్ మాసివ్ ఫిక్షన్ స్టోరీని తీసుకున్నట్లు అంచనా వేస్తున్నారు ఈ సినిమాలో హీరోయిన్గా భాగ్యశ్రీ నటిస్తున్న విషయం తెలిసిందే .  గ్లామర్ కంటే ఎమోషనల్ స్ట్రాంగ్ ప్రెసెన్స్ ఉండే క్యారెక్టర్ గా ఆ పాత్రను డిజైన్ చేశారట . అలాగే ఈ సినిమా ద్వారా భాగ్యశ్రీ కి టాలీవుడ్ లో గట్టి బ్రేక్ లభించే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు . ఇక సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న  ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 30న  ప్రేక్షకుల ముందుకు రానుంది .. తెలుగు తమిళం హిందీ మలయాళం కన్నడ భాషలో రిలీజ్ చేయనున్నారు . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా శ్రీలంక షెడ్యూల్ తో ఈ సినిమాకు సంబంధించిన కీలక ఘట్టం కంప్లీట్ అవుతుంది .  ఇక తర్వాత థియేట్రికల్ ట్రైలర్ సాంగ్స్ రిలీజ్ కు మేకర్స్ రెడీ అవుతున్నారు .. ఇక ఈ సమ్మర్ బాక్సాఫీస్ రేసులో కింగ్డమ్ ఎలాంటి అంచనాలు అందుకుంటుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: