ఇక గతంలో పూరి సక్సెస్ లో ఉన్నప్పుడు ఎప్పుడూ మీడియాకి ఇండస్ట్రీకి ఎంతో దగ్గరగా ఉంటూ వచ్చేవాడు . ప్రేక్షకుల పల్స్ ఏంటి వాళ్ళ టేస్ట్ ఎప్పుడు ఎలా ఉంటుంది ? ఇవన్నీ అంచనా వేసుకునే వాడు .  మీడియాతో ఎప్పుడూ తరచుగా ఇంటరాక్ట్  అవటం వల్ల వీటి గురించి ఇయ‌న‌కు ఎక్కువ విషయాలు తెలిసేవి .. టెంపర్ సినిమా వరకు అంతా భాగ్యాన్ని నడిచింది .. కానీ జ్యోతిలక్ష్మి చేసినప్పటి నుంచి పూరికి చార్మి బాగా దగ్గరింది ఆ సినిమాకి ఛార్మి కూడా నిర్మాతగా చేసిన విషయం అందరికీ తెలిసిందే ..  ప్రధాన నిర్మత సి కల్యాణ్ అయ‌న ఈ సినిమా విషయంలో చాలావరకు ఎక్కువ ఆధిపత్యం చూపించింది చార్మి అని అప్పుట్లో పెద్ద ఎత్తున చర్చ కూడా నడిచింది .. 


ఆ తర్వాత పూరి చేసిన లోఫర్ , ఇజం , రోగ్ , పైసా వసూల్ , మెహబూబా , ఇస్మార్ట్ శంకర్ , రొమాంటిక్ , లైగర్ , డబుల్‌ ఇస్మార్ట్ ఇలా వచ్చిన అన్ని సినిమాలని పూరి , ఛార్మి కలిసి నిర్మించారు .. అయితే వీటిలో ఇస్మార్ట్ శంకర్ తప్ప మిగిలిన సినిమాలన్నీ ప్లాప్‌ అయ్యాయి .. అయితే పురికి హిట్స్ ప్లాప్స్ అనేవి కొత్తకాదు . ఇదే క్రమంలో ఆయన సినిమాలు తీసే క్రమంలో మాత్రం ఎన్నో మార్పులు కూడా వచ్చాయి .. ఒకప్పుడు ఉదయం ఏడు గంటలకు షూటింగ్ మొదలు పెడితే సాయంత్రం 7 వరకు ఆక్వకుండా షూటింగ్ చేసేవాడు పూరి . ఆ తర్వాత నెక్స్ట్ రోజు షెడ్యూల్ కోసం రెడీ అయ్యేవాడు దాని వల్ల ఫాస్ట్గా సినిమాలు పూర్తయ్యేవి .  


కానీ ఇప్పుడు 12 గంటలకు షూటింగ్ మొదలు పెడితే సాయంత్రం 5 , 6 గంటలకి ప్యాకప్ చెప్పేసి పార్టీలకు వెళ్లిపోయి మిడ్నైట్ వరకు ఎంజాయ్ చేసే మూడ్లోనే పూరి ఉంటున్నట్టు టాక్ వచ్చింది .  అంతేకాకుండా తను ఎక్కువగా ముంబాయిలోనే ఉంటూ  అక్కడే ఉంటున్నట్టు వార్తలు వచ్చాయి .. అందుకే పూరీతో సినిమాలు చేయడానికి నిర్మాతలు కూడా ఎక్కువ ఆసక్తి చూపించడం లేదని కూడా అంటున్నారు .. అయితే ఇప్పుడు పూరి బయట నిర్మాతలకి కథలు వినిపించడం మొదలు పెట్టారట .. ఇటీవల ఆయన హైదరాబాదులో ఎక్కువగా ఉంటున్నట్టు ప్రచారం కూడా జరుగుతుంది. దీంతో పూరి , ఛార్మి విడిపోయారా ? అనే చర్చ కూడా మొదలైంది దీనిపై స్పష్టమైన క్లారిటీ రావాల్సి ఉంది .

మరింత సమాచారం తెలుసుకోండి: