టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మికకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో రష్మిక నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తూ మంచి లాభాలను సొంతం చేసుకుంటుంది. రష్మిక సైతం తనకు మంచి పేరు తెచ్చిపెట్టే సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుంది. హీరోయిన్ రష్మిక రెమ్యూనరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.
 
అయితే హీరోయిన్ రష్మిక ఆస్తులకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రష్మిక వయసు 28 సంవత్సరాలు కాగా ఆమె ఆస్తులు విలువ ఏకంగా 66 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. తక్కువ సమయంలోనే రష్మిక భారీ స్థాయిలో సంపాదించడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
 
 
ప్రస్తుతం ఒక్కో సినిమాకు రష్మిక పారితోషికం నాలుగు నుంచి 8 కోట్ల రూపాయల స్థాయిలో ఉందని సమాచారం అందుతుంది. సౌత్ సినిమాలకు పరిమితంగా రెమ్యూనరేషన్ అందుకుంటున్న రష్మిక నార్త్ సినిమాలకు మాత్రం భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక మరోవైపు యాడ్స్ లో నటిస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారు.
 
త్వరలో రష్మిక నటించిన సికిందర్ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తే రష్మికకు ఇండస్ట్రీలో తిరుగుండదని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. బెంగళూరు తో పాటు దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఆమె స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టిందని సమాచారం అందుతుంది. రష్మిక త్వరలో పెళ్లికి సంబంధించిన శుభవార్త సైతం చెబుతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ హీరో తో ఆమె లవ్ లో ఉన్నారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: