మెగా మేనల్లుడుగా పేరుపొందిన వైష్ణవ్ తేజ్ గత ఏడాది చివరిగా ఆదికేశవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. తన తదుపరి చిత్రాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు.. తన మొదటి సినిమా ఉప్పెనతో భారీ విజయాన్ని అందుకొని ఉప్పెనలా వచ్చిన వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత సరైన హిట్ అందుకోలేక పోతున్నారు. ఇప్పటికీ ఏడాదిన్నర పైగా అవుతూ ఉన్న చాలా కథలు వింటున్నప్పటికీ ఏది తనకు నచ్చలేదట. ఇక దర్శక ,నిర్మాతలు కూడా కథలు చెబుతున్నప్పటికీ వైష్ణవ్ తేజ్ కు నచ్చకపోవడంతో కొత్త రచయితల వైపుగా అడుగులు వేస్తున్నారట.


ముఖ్యంగా కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఆచితూచి అడుగులు వేస్తున్నారట. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మరొక ఫ్లాప్ పడిందంటే ఇక మెగా అల్లుడు కెరియర్ ముగిసినట్టే అంటూ పలువురు మెగా అభిమానులు కూడా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఏర్పడుతున్న గ్యాప్ వల్ల తన సిని మార్కెట్ పైన కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుందంటూ చాలామంది  అభిమానులతో పాటు సినీ విశ్లేషకులు కూడా తెలియజేస్తున్నారు.


మరి ఈ కొత్త ఏడాది అయిన త్వరగా ఏదైనా కథతో అభిమానులను మెప్పిస్తే సరిపోతుంది.. లేకపోతే ఇక మెగా హీరో కెరియర్ పరిస్థితి చెప్పలేని పరిస్థితిలో ఉండిపోతుంది తన అన్న సాయి ధరమ్ తేజ్ కూడా విరూపాక్ష తర్వాత ఎక్కువ సమయం తీసుకుని మళ్లీ ఒక విభిన్నమైన కథ సంబరాల ఏటిగట్టు చిత్రంతో  ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. విరూపాక్ష చిత్రంతో 100 కోట్ల క్లబ్ లోకి చేరిన సాయి ధరమ్ తేజ్ తన తదుపరి చిత్రాన్ని కూడా ఆచితూచి అడుగులు వేస్తూ మరి ముందుకు వెళ్తున్నారు. మరి అన్న అడుగుజాడలలోనైనా నడిచి సరైన సక్సెస్ ని అందుకుంటారో లేకపోతే సినీ ఇండస్ట్రీ నుంచి ఫెయిడౌట్ హీరోగా మారిపోతారు చూడాలి మరి వైష్ణవి తేజ్.

మరింత సమాచారం తెలుసుకోండి: