మంచు ఫ్యామిలీలో గత రెండు మూడు నెలల నుండి మనోజ్ కి విష్ణు,మోహన్ బాబు లకి మధ్య గొడవలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.మనోజ్ మోహన్ బాబు విష్ణు కి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఫ్యామిలీపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు.ఇప్పటికే వీరి ఫ్యామిలీ గొడవ రోడ్డుకెక్కిన సంగతి మనకు తెలిసిందే. అంతే కాకుండా మీడియా వాళ్ళు కలగజేసుకొని ఈ విషయాన్ని మరింత రచ్చ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక పోలీస్ స్టేషన్ చుట్టూ కోట్ల చుట్టూ తిరిగి ఇంటి గొడవ కాస్త రోడ్డుకి ఎక్కించారు. అయితే తాజాగా ఈ గొడవపై స్పందించింది మంచు మోహన్ బాబు పెద్ద కోడలు విరాణికా రెడ్డి.. అయితే సాధారణంగా విరానిక ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వదు. 

కానీ ఫస్ట్ టైం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఫ్యామిలీ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపెడుతుంది.అయితే కన్నప్ప మూవీ రిలీజ్ కి ముందు ఇలా విరాణిక ఇంటర్వ్యూలు కన్నప్ప మూవీకి ప్రమోషన్స్ లాగా పనికొస్తాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో  వీరానికకి ఫ్యామిలీ గొడవలపై ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ గొడవలపై విరాణిక మాట్లాడుతూ.. అందరి ఇళ్లలో లాగే మా ఇంట్లో కూడా గొడవలు ఉన్నాయి. అయితే ఈ గొడవలు రోడ్డుమీదికి వచ్చాయి.ఈ గొడవల వల్ల మా కుటుంబం చాలా ప్రభావితం అవుతుంది. ముఖ్యంగా పిల్లలపై ఈ గొడవలు ఎఫెక్ట్ చూపిస్తాయి.

అందుకే నా పిల్లలపై ఈ గొడవల ప్రభావం చూపకుండా ఎంతో జాగ్రత్త చూసుకొని ఈ గొడవకు దూరంగా నా పిల్లల్ని ఉంచుతున్నాను. ముఖ్యంగా ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య జరిగే ఆస్తి గొడవల విషయంలో నా పిల్లలు భయపడుతున్నారు. తర్వాత ఏం జరుగుతుందో అని వారిలో ఒక ఆందోళన ఉంది.అందుకే వారిని ఆ భయం నుండి బయటపడేసి దూరంగా పెంచుతున్నాను. ఇలాంటి గొడవల పట్ల పిల్లలు ఆకర్షితులు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాను అంటూ మంచు ఫ్యామిలీలో జరిగే గొడవలపై మొదటిసారి స్పందించింది మంచు విష్ణు భార్య విరాణిక

మరింత సమాచారం తెలుసుకోండి: