మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి తో కలిసి ఓ సినిమా చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే .. అయితే ఈ సినిమా పూజ కార్యక్రమాలు ఉగాది రోజున జరగబోతుందని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది .. ఈ వార్త ఇప్పుడు అభిమానులు ఆనందాన్ని నింపుతుంది .. అయితే ఈ సినిమాని కంప్లీట్ వినోదాత్మక సినిమాగా తెర్కక్కిస్తున్నారట .. చిరంజీవి ఈ సినిమాలో ఓ ప్రత్యేకమైన క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు . ఆయన కామెడీ టైమింగ్ ఎంతో కొత్తగా ఆయన వ్యక్తిత్వం  ఇప్పటివరకు చూడని విధంగా ఈ సినిమాలో ఆయన పాత్ర ఎంతో ఆకర్షణంగా ఉంటుందట . అలాగే అనిల్ రావిపూడి తనదైన శైలిలో విజయవంతమైన సినిమాలను చేయటంలో సిద్ధహస్తుడు .. ఈ కాంబినేషన్లో వచ్చే సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఎంతగానో కడుపుబ్బ నవ్వించే అనుభవాన్ని అందిస్తుందని అంతా అంటున్నారు .. 


అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులని అలరించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది . ఇక ఇప్పుడు చిరంజీవి తో ఆయన చేయబోయే సినిమా కూడా అదే రీతిలో సక్సెస్ సాధిస్తుందని అంతా అంటున్నారు .. చిరంజీవి గతంలో చుట్టాలబ్బాయి , గ్యాంగ్ లీడర్ వంటి సినిమాల్లో ఆయన చేసిన కామెడీ కోణాన్ని మళ్లీ ఈ సినిమాలు చూడవచ్చు అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు .. ఇక ఈ సినిమా ఒక్క పూజా కార్యక్రమం ఉగాది రోజున జరగబోతుంది .  తెలుగు సంవత్సరాది లో ఈ శుభకార్యం జరగటం మరో విశేషం .. అయితే ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి మొదలుకానుందని .. 2026 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాబోతుందని ఇప్పటికే ప్రకటించారు .. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గరపాటి నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సమీర్ రెడ్డి సినిమాఆటోగ్రఫీ అందిస్తున్నారు .. మరి ఈ సినిమా తో అనిల్ , మెగాస్టార్ కి ఎలాంటి సక్సెస్ ఇస్తాడో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: