తెలుగు ఇండస్ట్రీలో కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముందువరుసలో ఉంటారు. భార్య లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. భార్యతో కలిసి జపాన్ కు వెళ్లిన తారక్ అక్కడే భార్య పుట్టినరోజు వేడుకలు జరిపారు. జపాన్ లో దేవర సినిమా విడుదల కాగా అక్కడ ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. దేవర సినిమా ప్రీమియర్స్ కు జపాన్లో మంచి రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం.
 
భార్య పుట్టినరోజు సందర్భంగా దిగిన ఫోటోలను తారక్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. "అమ్మలు.. హ్యాపీ బర్త్ డే" అంటూ తారక్ భార్యపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. జపాన్ ట్రిప్ ముగిసిన వెంటనే తారక్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమాలో నటించనున్నారు.
 
లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు సందర్భంగా తారక్ గతంలో ఫామ్ హౌస్ ను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ ఫామ్ హౌస్ కి బృందావనం అని పేరు పెట్టారు. లక్ష్మీ ప్రణతి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటానికి ఇష్టపడరు. కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడానికి లక్ష్మీ ప్రణతి ఇష్టపడతారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల సక్సెస్ లో లక్ష్మీ ప్రణతి పాత్ర కొంతమేర ఉందని ఫ్యాన్స్ భావిస్తారు.
 
జూనియర్ ఎన్టీఆర్ తర్వాత సినిమాలపై అంచనాలు పెరుగుతుండగా ఆ సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాల్సి ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న తారక్ భవిష్యత్తు సినిమాలతో సంచలనాలను సృష్టించాలని అభిమానులు ఫీలవుతున్నారు. కెరీర్ విషయంలో తారక్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇతర భాషల్లో సైతం సక్సెస్ దక్కేలా జూనియర్ ఎన్టీఆర్ ప్లాన్స్ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలను సృష్టిస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు.


మరింత సమాచారం తెలుసుకోండి: