
అయితే ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కేసులో సెలబ్రిటీలను విచారిస్తున్నారు పోలీసులు బుల్లితెర నటిమణులు రీతూ చౌదరి , యాంకర్ విష్ణుప్రియ , యాంకర్ శ్యామల పోలీసులు విచారణకు హాజరయ్యారు .. అదేవిధంగా మియాపూర్ పోలీసులు ఎవరెవరు ఏ ఏ యాప్స్ కు ప్రచారం చేశారని విషయాలను కనుక్కున్నారు .. అలాగే పలు కంపెనిల పైన కూడా కేసులను నమోదు చేసిన పోలీసులు జంగిల్ రమ్మీ యాప్ కోసం రాణా , ప్రకాష్ రాజ్.. ఏ 23 యప్ కోసం విజయ్ దేవరకొండ , యోలో 247 యాప్ కోసం మంచు లక్ష్మి, ఫెయిర్ ప్లే లైవ్ యాప్ కు హీరోయిన్ ప్రణీత .జీట్ విన్ యాప్ కోసం నిధి అగర్వాల్ ఆంధ్ర 365 ఆప్ కోసం నటి శ్యామల పనిచేసినట్లు గుర్థించారు ... అయితే ఇప్పుడు సిఐడి కి బదిలీ అయిన ఈ కేసులో రాబోయే రోజుల్లో మరిన్ని నిజాలు వాస్తవాలు బయటికి వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు . మరి ఈ బెట్టింగ్ యాప్ ల వ్యవహారం తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.