
డైరెక్టర్ మారుతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై భారీ ఎక్స్ ప్రెస్టేషన్స్ నెలకొన్నాయి .ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మధ్యకాలంలో విడుదలైన పోస్టర్స్ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి .హారర్ కామెడీ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా లో ప్రభాస్ సరికొత్తగా కనిపించబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. తన కొత్త ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ ఎక్కువగానే కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ లైఫ్ ,స్టైల్, కార్ కలెక్షన్ గురించి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు . ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఓ బాలీవుడ్ నివేదిక ప్రకారం ప్రభాస్ ఆస్తి రూ. 240 కోట్లకు పైగా ఉంటుంది. బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు దాదాపు రూ. 2 కోట్లు తీసుకుంటాడని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ వద్ద కారు కలెక్షన్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. ప్రస్తుతం ప్రభాస్ వద్ద రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు ఉంది .ఈ కారు విలువ రూ . 8 కోట్లు ఉండవచ్చు.. ఇండస్ట్రీలో అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, అమితాబచ్చన్ వద్ద మాత్రమే ఈ కారు ఉందంట. అలాగే ప్రభాస్ దగ్గర రూ 2.08 కోట్ల విలువైన జాగ్వార్ XJR కారు ఉంది. అలాగే రూ.1 కోటి విలువైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కార్ తో పాటు డార్లింగ్ క్యారేజీలో లాంబోర్గినీ అవెంటడోర్ రోడ్ స్టర్ కారు ఉంది. దీని విలువ రూ. 6 కోట్లు ఉంటుంది. అలాగే రూ. 68 లక్షలు విలువైన BMW X3ఉన్నాయి. ప్రభాస్ కి ఎన్ని కార్లు ఉన్నాయా ..అసలు ప్రభాస్ కు ఇన్ని కార్లు అవసరమా అంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ సినిమాతో పాటు డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్లో ఒక సినిమా చేస్తు సలార్ 2 చిత్రంలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు ప్రభాస్..