ఎవరు చూసినా.. ఎక్కడ చూసినా.. ఎప్పుడు చూసినా.. రష్మిక రష్మిక రష్మిక అని అంటూనే ఉన్నారు.  మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ పేరే ఒక పెద్ద వైరల్ గా మారిపోయింది.  ఏ హీరో సినిమాలో నటించాలి అన్న హీరోయిన్ పాత్ర కోసం రష్మిక స్పెషల్ సాంగ్ లో నటించాలి అంటే రష్మిక..ఏదైనా సినిమాకి ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించాలి అంటే రష్మిక ఒకటా రెండా నిద్రలేచిన మొదలు నిద్రపోయే వరకు ప్రతి విషయంలోనూ రష్మిక రష్మిక రష్మిక అంటూ జపం చేస్తున్నారు సినీ స్టార్స్ . 


అఫ్ కోర్స్ రష్మిక అందంగా ఉంటుంది .. బాగా నటిస్తుంది మంచి అవకాశాలు అందుకుంటుంది . బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటుంది . ఆ మాత్రం దానికి ఆమె పేరు పై ఇంత హైప్ క్రియేట్ చేయాలా అని సామాన్య జనాలు  క్వశ్చన్ చేస్తున్నారు.  అయితే రష్మిక ఫ్యాన్స్ మాత్రం దేవతల ట్రీట్ చేస్తున్నారు . అయితే అసలు రష్మిక మందన్నా ఇంతటి స్థానం అందుకోవడానికి మెయిన్ రీసన్ ఓ స్టార్ హీరో భార్య అంటూ టాక్ వినిపిస్తుంది . ఆమె మరి ఎవరో కాదు వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి .



మెగా ఇంటి కోడలు .. ఇండస్ట్రీలో హీరోయిన్..  లావణ్య త్రిపాఠి ఒక సినిమా అవకాశం వదులు కోవడం వల్లే అది రష్మిక మందన్నా చేతికి వెళ్ళింది అని ఆ సినిమా హిట్ అవ్వడంతోనే ఇప్పుడు ఇంత స్థాయిలో ఆమె రాజ్యమేలేస్తుంది అని జనాలు మాట్లాడుకుంటున్నారు . ఆ సినిమా మరేంటో కాదు గీతగోవిందం . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . రష్మిక - విజయ్ దేవరకొండల మధ్య రొమాన్స్ ..నాటీసిన్స్ బాగా పండాయి.  నిజానికి రష్మిక మందన్నా ప్లేస్ లో ముందుగా లావణ్య త్రిపాఠినే అనుకున్నారట . కానీ ఆమె ఇందులో లిప్ లాక్ సీన్ ఉంది నేను చేయను అంటూ తెగేసి చెప్పేసిందట . అలా ఈ ఆఫర్ రిజెక్ట్ చేయడంతో ఈ ఆఫర్ రష్మిక ఖాతాలో పడి ఇప్పుడు నేషనల్ క్రష్ గా ఆమె ఇండస్ట్రినీ ఏలేసి స్థాయికి వెళ్ళిపోయింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: