
టాలీవుడ్ యంగ్ టైగర్ ... మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో చేసిన అవైటెడ్ సినిమా. రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో చూశాం. దేవర తర్వాత ఎన్టీఆర్ నటించే సినిమాలు వరుసగా సెట్స్ మీదకు వెళుతున్నాయి. ఇక దేవర సినిమా ఇండియన్ సినీ జనాలను షేక్ చేశాక ఇప్పుడు జపాన్ దేశంలో రిలీజ్ కి వెళ్ళింది. ఇక తారక్ కు జపాన్ దేశంలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో చెప్పక్కర్లేదు. టెంపర్ సినిమా నుంచి జపాన్ లో తారక్ క్రేజ్ రోజు రోజుకు విపరీతంగా పెరిగి పోతూ వస్తోంది.
ఇక జపాన్ లో తారక్ దేవర సినిమాను అగ్రెసివ్ గా ప్రమోషన్స్ చేసేందుకు ముందే వెళ్ళాడు. అయితే అక్కడ ఫ్యాన్స్ తో ముచ్చటించిన తారక్ ఇపుడు ఓ బ్యూటిఫుల్ పోస్ట్ షేర్ చేసుకున్నాడు .. ఇది ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. జపాన్ కు భార్య ప్రణతిని కూడా జపాన్ తీసుకెళ్లగా అక్కడ తన బర్త్ డే వేడుకలు చేయడం విశేషం. ఇలా ఇద్దరి నడుమ కొన్ని హ్యాపీ మూమెంట్స్ నడిచాయి. ఇప్పుడు ఆ ఫొటోల ను తారక్
షేర్ చేసుకోగా అవి ఇపుడు వైరల్ అవుతున్నాయి.
ఇక ఇవి చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ లక్ష్మీ ప్రణతికి బెర్త్ డే శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. ఇక దేవర సినిమా జపాన్ లో రేపు మార్చ్ 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుండగా ఆల్రెడీ అక్కడ ప్రీమియర్స్ కి సాలిడ్ టాక్ వచ్చింది.