
ఈ ఫ్లాప్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువగానే అనిపిస్తుంది. మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా లభోదిభో అంటూ కన్నీళ్లు పెట్టుకున్న సినిమా ఇదే. ఆ సినిమా మరేంటో కాదు "బ్రహ్మోత్సవం". మహేష్ బాబు ఎందుకు ఈ సినిమా ఒప్పుకున్నాడు అనేది ఆయనకే తెలియాలి . శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రణిత - సమంత హీరోయిన్లు గా కనిపించారు . ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది . ఈ సినిమా ఆయన కెరియర్ లోనే డిజాస్టర్ టాక్ దక్కించుకుంది.
అయితే మొదటిగా ఈ సినిమాలో రాంచరణ్ హీరోగా అనుకున్నారట . కానీ రామ్ చరణ్ ఈ కథను సున్నితంగా రిజెక్ట్ చేశారట . కాగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉన్న ఎక్కడ కూడా కథలో పెద్దగా పస లేకపోవడంతో మెగా స్టార్ చిరంజీవి ఈ సినిమాను చరణ్ చేయనీయకుండా అడ్డుకున్నారట . ఆఖరికి మహేష్ బాబు బలైపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అడ్డంగా బుక్ అయిపోయాడు మహేష్ బాబు. " బ్రహ్మోత్సవం " సినిమాతో అంటూ అప్పట్లో చాలామంది జనాలు మాట్లాడుకున్నారు . ప్రజెంట్ మహేష్ బాబు - రాజమౌళి దర్శకత్వంలో సినిమాలో బిజీ బిజీగా ఉన్నాడు . రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది . త్వరలోనే ఆఫ్రికా అడవులకు పయనం కాబోతుంది ఎస్ ఎస్ ఎం బి 29 టీం..!