
ఈ నేపధ్యంలోనే, ఆమెకి విచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ ముద్దు సన్నివేశం గురించి ప్రత్యేకంగా అడగగా.. నటి సురభి లక్ష్మి ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించిన అనుభవాలను గురించి సో కాల్డ్ మీడియా ముందు ఏకరువు పెట్టింది. అది లిప్ లాక్ అని తనకు షూట్ రోజున మాత్రమే తెలిసిందని చెబుతూ... ఈ సీన్ ని మొదట సాదాసీదా ముద్దుగా భావించానని, అయితే అది పూర్తి స్థాయి లిప్ లాక్ అని తర్వాత తెలిసిందని చెప్పుకొచ్చింది. జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ నటి లిప్ లాక్ సీన్ ఉందని తెలిసిన తర్వాత షాక్ తినకుండా ఆ సీన్ పండించడం కోసం చేసిన ముందస్తు ప్రయత్నాలు గురించి చెప్పి అందరి ప్రశంసలు పొందింది.
ఆమె మాట్లాడుతూ... సినిమాలో తన భర్తగా నటించిన సజీవ్ కుమార్‌ను ఎలా ఫీల్ అయ్యాడో తెసుకోవాలని, ‘టెన్షన్ గా ఉన్నావా? అని అడగగా... అతను కూడా నాలాగే ఏ టెన్షన్ పడడంలేదని చెప్పాడు! అంటూ గుర్తు చేసుకుంది. అయితే, ‘అతను సిగరెట్ తాగే అలవాటున్నవాడు కాబట్టి, షాట్‌కు ముందు అతనిని పళ్ళు తోముకుని తిరిగి రావాలని కోరానని వెల్లడించింది. అంతేకాదు సెట్‌లోని ఫుడ్ డిపార్ట్‌మెంట్ వాళ్లను పిలిచి యాలకులు కొని తీసుకురావాలని కూడా కోరింది. షాట్ కు ముందు వాటిని నోట్లో వేసుకుని కాసేపు నామిలానని చెప్పుకొచ్చింది. సాధారణంగా శృంగార సన్నివేశాలు తక్కువ మంది షూటింగ్ సిబ్బందితో చిత్రీకరించడ జరుగుతుంటుంది. అక్కడ కూడా అదే వాతావరణం కల్పించినపుడు, అలాంటిదేమి వద్దని... మేము కేవలం నటిస్తాం కదా! దానికి మీరు అలా చేయాల్సిన పనిలేదని, షూటింగ్ కి అవసరమైన సిబ్బందిని ఉండనివ్వాల్సిందిగా కోరామని చెప్పుకొచ్చింది.