నయనతార గురించి తాజాగా ఒక వార్త కోలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. అదేంటంటే..సుందర్ సి డైరెక్షన్లో వస్తున్న మూకుత్తి అమ్మన్ -2 సినిమాలో షూటింగ్ జరుగుతున్న సమయంలో నయనతార అసిస్టెంట్ డైరెక్టర్ తో గొడవ పడిందని, ఈ గొడవ కాస్త డైరెక్టర్ సుందర్ సి దగ్గరికి వెళ్లడంతో సుందర్ సి ని కూడా నయనతార అవమానించిందని, ఇక అవమానం భరించలేని సుందర్ సి షూటింగ్ ఆపేసి నయనతారని ఈ సినిమా నుండి తొలగించి వేరే హీరోయిన్ ని పెట్టుకోవాలి అన్నట్లుగా నిర్మాతతో తేల్చి చెప్పారని, కానీ నిర్మాత ఈ విషయంలో కలుగజేసుకొని నయనతారకి డైరెక్టర్ సుందర్ సి కి మధ్య సఖ్యత కుదిర్చారని, ఇద్దరి మధ్య ఉన్న గొడవని క్లియర్ చేశారంటూ వార్తలు వినిపించాయి. 

అయితే గత రెండు రోజుల నుండి వినిపిస్తున్న ఈ వార్తలకు డైరెక్టర్ సుందర్ సి భార్య హీరోయిన్ కుష్బూ క్లారిటీ ఇచ్చింది. కుష్బూ సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా పోస్ట్ పెట్టింది.. గత కొన్ని గంటల నుండి సోషల్ మీడియాలో మూకుత్తి అమ్మన్ -2 మూవీ గురించి ఎన్నో రూమర్లు వస్తున్నాయి.అయితే ఈ రూమర్లు ఆగిపోవాలనే నేను ఈ పోస్ట్ చేస్తున్నాను. అయితే ఈ రూమర్లను సుందర్ సి పట్టించుకోరు.నయనతార ఒక అద్భుతమైన నటి.ఆమె తన వృత్తిని సాఫీగా కొనసాగిస్తుంది. అలాగే షూటింగ్ ఎక్కడ జరుపుకోవాలి అని నిర్ణయించారో ప్రస్తుతం అక్కడ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

 ఈ రూమర్స్ ప్రచారం చేయడం ఆపండి. సుందర్ సి నుండి మరొక హిట్ మూవీ చూడడానికి వెయిట్ చేయండి అంటూ కుష్బూ ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టింది. గత కొద్ది గంటల నుండి కుష్బూ భర్త సుందర్ సి కి నయనతారకి మధ్య గొడవలు జరుగుతున్నాయి అంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టడం కోసమే కుష్బూ ఈ పోస్ట్ పెట్టినట్టు అర్థమవుతుంది.ఇక కుష్బూ పోస్టుతో నయనతార సుందర్ సీ మధ్య ఎలాంటి గొడవలు లేవు అని అందరికీ ఓ క్లారిటీ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: