ప్రముఖ హాస్య నటుడిగా.. నట కిరీటిగా.. పేరు తెచ్చుకున్న రాజేంద్రప్రసాద్ ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాల్లో చేశారు. ముఖ్యంగా ఈయనకు కామెడీ హీరో అనే పేరు ఉంది.అయితే అలాంటి రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం తాత,తండ్రి వంటి పాత్రలు చేస్తూ సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే రీసెంట్గా ఆయన రాబిన్ హుడ్ మూవీ ఈవెంట్లో స్టార్ క్రికెటర్ అయినటువంటి డేవిడ్ వార్నర్ పై మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వివాదానికిదారి తీసాయి. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ అభిమానులు రాజేంద్రప్రసాద్ పై గుర్రుగా ఉండడంతో పాటు రాజేంద్రప్రసాద్ ని విమర్శిస్తూ ట్రోల్ చేశారు.ఇక వారి విమర్శల పట్ల రాజేంద్రప్రసాద్ ఒక మెట్టు దిగి నేను డేవిడ్ వార్నర్ ని అలా అన్నందుకు క్షమించండి.నేను తప్పు చేశాను తప్పుగా మాట్లాడాను అంటూ క్షమాపణలు కూడా కోరారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా రాజేంద్రప్రసాద్ కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.అయితే ఆ వీడియోలో రాజేంద్రప్రసాద్ ప్రవర్తించిన ప్రవర్తనకు చాలామంది నెటిజన్లు షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు.అయితే తాజాగా రాజేంద్రప్రసాద్ కి సంబంధించి ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.ఆ వీడియోలో ఏముందంటే.. రాజేంద్రప్రసాద్ తన కారు నుండి దిగి కారు డోర్ ని చేతితో వేయకుండా కాలితో కాస్త పొగరుగా తన్నారు.అయితే అలా కారు డోర్ ని కాళ్ళతో తన్నిన రాజేంద్రప్రసాద్ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్స్ ఈ వీడియో చూసి రాజేంద్రప్రసాద్ పీకలదాకా తాగి ఈవెంట్ కు వచ్చారు. 

అందుకే ఎలా ప్రవర్తిస్తున్నారో చూడండి..అంటూ వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు. అంతే కాదు రాజేంద్ర ప్రసాద్మూవీ ఈవెంట్లో  అలా మాట్లాడడానికి కారణం కూడా ఆయన తాగిన మద్యపానమే.. మత్తులో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా అలా డేవిడ్ వార్నర్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన తాగే ఈవెంట్ కు వచ్చారు అంటూ ఈ వీడియో చూసిన నెటిజన్లు రాజేంద్రప్రసాద్ క్యారెక్టర్ ఎలాంటిదో అర్థమయ్యింది అంటూ తేల్చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: