టాలీవుడ్ లో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని తేడా లేకుండా సీక్వెల్స్ సైతం మొదలవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అలా జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మాడ్ స్క్వేర్.. ఈ చిత్రం 2023లో విడుదలైన మ్యాచ్ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కించడం జరిగింది. ఈనెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతున్న తరుణంలో చిత్ర బృందం కూడా ప్రమోషన్స్ ను వేగవంతంగా చేసింది. ఇందులో భాగంగా తాజాగా ట్రైలర్ ని కూడా చిత్ర బృందం విడుదల చేసింది.


ట్రైలర్ లో లడ్డు గాడి పెళ్లి ముచ్చటతో ఈ ట్రైలర్ మొదలవుతుంది.. ఆ తర్వాత గోవాకు వెళ్లి అక్కడ ముగ్గురు యువకులు ఎలాంటి అనుభవాలను ఎదురయ్యాయని విషయాన్ని వారు ఎలా భయపడ్డారు అనే విషయాన్ని ఈ ట్రైలర్ లో చూపించారు. మ్యాడ్  స్క్వేర్ ట్రైలర్ మొత్తం కూడా కడుపుబ్బ కామెడీతో నవ్వించేలా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా నార్నే నితిన్, సంగీత్ శోభన్ ఫ్రెండ్స్ తో చేసేటువంటి కామెడీ కూడా హైలెట్గా నిలుస్తోంది. ట్రైలర్ మొత్తం కూడా నవ్వులు పూయించేలా మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్  అదిరిపోయేలా కనిపిస్తోంది.



ఈసారి కూడా బొమ్మ హిట్ అంటూ పలువురు నెటిజెన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. కళ్యాణ్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మ్యాడ్ చిత్రానికి మించి మరి ఈసారి మ్యాడ్ స్క్వేర్ అల్లరి చేయబోతున్నట్టు కనిపిస్తోంది. భారీ అంచనాల మధ్య ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మరి ఎలాంటి కలెక్షన్స్ ని రాబట్టి ప్రేక్షకులకు మరిచిపోలేని వినోదాన్ని  అందిస్తుందేమో చూడాలి మరి. ట్రైలర్ తోనే బొమ్మ హిట్ అనిపించుకుంటున్న మ్యాడ్ స్క్వేర్ ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: