పూజ హెగ్డే ఈ మధ్యకాలంలో చాలా ట్రోల్స్ కి గురవుతుంది. దానికి ప్రధాన కారణం రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.కొంత మంది నామీద పగ పట్టినట్లు లక్షలు ఖర్చుపెట్టి నామీద ట్రోల్స్ చేస్తున్నారు. వాటి వల్ల నా ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది బాధపడుతున్నారు అంటూ పూజ హెగ్డే చెప్పుకొచ్చింది. అయితే కొద్దిరోజుల నుండి ఈ ట్రోల్స్ ని పట్టించుకోవడం మానేశాను అంటూ కూడా పూజ హెగ్డే ఆ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా పూజ హెగ్డే ఓ పెళ్లయిన హీరోతో నదిలో రొమాన్స్ చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో చక్కర్లు కొడుతుంది.మరి ఇంతకీ ఆ వీడియోలో ఉన్నది ఎవరయ్యా అంటే బాలీవుడ్  నటుడు వరుణ్ ధావన్. 

అయితే వరుణ్ ధావన్ పూజ హెగ్డే కాంబోలో ప్రస్తుతం ఓ సినిమా వస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ తాజాగా రిషికేష్ లో జరుపుకుంటుంది.ఇక రిషికేష్ లోని ఓ నదిలో సరదాగా వీళ్ళిద్దరూ స్విమ్మింగ్ చేశారు. అయితే ఆ స్విమ్మింగ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడం కారణంగా ఈ వీడియో బీ టౌన్ లో వైరల్ అవ్వడంతో పెళ్లయిన హీరోతో పూజ హెగ్డే నదిలో రొమాన్స్ చేస్తుంది అంటూ చాలా మంది జనాలు కామెంట్లు పెడుతున్నారు. 

ఇక ఆ వీడియోలో పూజ హెగ్డే స్విమ్ సూట్ వేసుకుకొని పూజ వరుణ్ ఇద్దరు నదిలో స్విమ్ చేయాలి అనుకుంటారు. ఆ టైంలో వరుణ్ ధావన్ పూజ హెగ్డే చేయి పట్టుకొని ఆమెను నదిలోకి ఈడ్చుకెళ్లారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.ఇక వరుణ్ ధావన్ పూజ హెగ్డే కాంబినేషన్లో హై జవానీ తో ఇష్క్ హోనా హై అనే సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఉత్తరాఖండ్లోని రిషికేష్ లో జరుగుతుండగా.. అక్కడ పూజలు చేసిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: