
ఈ చిత్రంలో బుల్లి రాజు పాత్రలో నటించిన రేవంత్ అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. అలాగే మీనాక్షి చౌదరి కామెడీ, ఐశ్వర్య రాజేష్ కామెడీ ,వెంకటేష్ కామెడీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మొత్తానికి ఫ్యామిలీ ఆడియన్స్ తో ఎక్కడ చూసినా సంక్రాంతికి వస్తున్నాం సినిమా హావా బాగా కొనసాగింది. అయితే ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి మధ్య జరిగేటువంటి కొన్ని కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులనే కాకుండా ఇతర దేశస్థులను కూడా బాగా నవ్వించాయి.
ఇందులో భాగంగా విదేశీయులు కూడా ఒక స్కిట్లు చేస్తూ ఒక వీడియో వైరల్ గా మారుతున్నది. హీరో వెంకటేష్ ని ఇమిటేట్ చేస్తూ ఒక రీల్ చేస్తూ ఇదిగో వచ్చింది మీనాక్షి.. ఇందాకేమో ఆ మూలకు వెళ్లి కులికారు.. ఇప్పుడు మరి ఈ మూలకు వెళ్లి కులకండి అంటూ.. వాట్ ద హెల్ అనే డైలాగ్ తో విదేశీయులు సోషల్ మీడియా నెటిజెన్స్ ని మరొకసారి కడుపుబ్బా నవ్వించారు. విరి రియాక్షన్స్ కూడా సెట్ అవ్వడంతో ఈ రీచ్ చూసిన పలువురు అభిమానులు ఫిదా అవుతున్నారు. మొత్తానికి ఈ వీడియో వైరల్ గా మారుతున్నది.