
ఓదెల -2 సినిమా బడ్జెట్ కూడా 23 కోట్లు అయినట్టుగా తెలుస్తోంది.దీంతో నాన్ థి యేట్రికల్ హక్కుల ద్వారా సుమారుగా 20 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా రిలీజ్ కంటే ముందే దాదాపుగా బడ్జెట్లో 80 శాతం వరకు రికవరీ అయినట్లుగా చెప్పవచ్చు.. ఇదంతా కూడా ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ను కంటెంట్ బట్టే వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా ఓటిటి హక్కులను సుమారుగా 10 కోట్ల రూపాయలకు పైగా కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సపరేట్గా హిందీ డబ్బింగ్ రైట్స్, శాటిలైట్ హక్కులను కూడా బాగానే ఆదాయం తీసుకువచ్చేలా ఉన్నదట.
ఓదెల - 2 ఈ చిత్రానికి డైరెక్టర్ సంపత్ నంది కాకుండా అతని దర్శకత్వ పర్యవేక్షణలో మరొక డైరెక్టర్ అశోక్ తేజ తెరకెక్కిస్తూ ఉన్నారు. తమన్నా ఈ సినిమాకి ప్రత్యేకంగా ఆకర్షనీయంగా నిలవడం గమనార్హం. మరి ఈ రేంజ్ లోనే నాన్ థియేట్రికల్ సాధించడము అంటే బయ్యర్లకు ఈ సినిమా పైన ఎలాంటి నమ్మకం ఉందో చెప్పవచ్చు ఏప్రిల్ 17వ తేదీన ఈ ఏడాది విడుదలకు సిద్ధంగా ఉంది ఓదెల-2. మరి థియేటర్లో విడుదల ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి మరొకసారి తమన్నా ఈ సినిమాతో కొనసాగిస్తుందేమో మరింత క్రేప్ కొనసాగిస్తుందేమో చూడాలి మరి