మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన చిరంజీవి తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును అందుకున్నారు. తన నటనకు గాను ఎన్నో అవార్డులను సైతం చిరంజీవి అందుకోవడం గమనార్హం. కాగా, చిరంజీవి ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇక చిరంజీవి తన తదుపరి సినిమాకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి తన తదుపరి సినిమాను స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి చేయనున్న సంగతి తెలిసిందే.



సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభిస్తారని ఎన్నో రకాల వార్తల వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అనిల్ రావిపూడి ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఫైనల్ స్క్రిప్ట్ పూర్తయినట్లుగా అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. అంతేకాకుండా చిరంజీవి గారికి నా కథలో పాత్ర శంకర్ వరప్రసాద్ తో పరిచయం చేస్తాను. ఆయనకు సినిమా కథ కూడా చెప్పాను.


చిరంజీవి గారికి సినిమా కథ ఎంతో చక్కగా నచ్చిందని అనిల్ రావిపూడి అన్నాడు. త్వరలోనే సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలను ప్రారంభిస్తామని అనిల్ రావిపూడి అన్నారు. త్వరలోనే ముహూర్తంతో చిరునవ్వుల పండగ బొమ్మకి శ్రీకారం అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. కొత్త సంవత్సరం ఉగాది సందర్భంగా సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు ఏంటి అనే విషయాలు అనిల్ రావిపూడి ఇంతవరకు వెల్లడించలేదు.

కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా నటించబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. తమన్నా ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక చిరంజీవి సినిమాలో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని తమన్నా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారట. ఇక ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: