
మలయాళం లో బ్రో డాడీ, ఆంటోని, తాలుమల్ల వంటి చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్న కళ్యాణి ప్రియదర్శన్ అక్కడ కుర్రాళ్ళ గుండెల్లో క్రష్ గా మిగిలిపోయింది. మలయాళ సినీ ఇండస్ట్రీలోని భారీ డిమాండ్ ఉన్న హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయట. తమిళంలో భారీ బడ్జెట్ చిత్రాలలో కూడా నటిస్తూ ఉన్న ఈమె రీసెంట్ బట్టి చూస్తే ఇక మీదట తెలుగు సినిమాలలో కనిపించదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.
సుమారుగా కోలీవుడ్ ,మాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టి ఆరేళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీని మర్చిపోయింది.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పేరుపొందిన ప్రియదర్శన్ ఆయన భార్య లీజి ముద్దుల కుమార్తెగా కళ్యాణి ప్రియదర్శన్ పేరు సంపాదించింది.. ఇండస్ట్రీ ఉన్న బ్యాక్ గ్రౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన సొంత టాలెంట్ తో ఈ ముద్దుగుమ్మ దూసుకుపోతోంది. మరి రాబోయే రోజుల్లో తెలుగు ఇండస్ట్రీలో కూడా తన సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకొని రావాలని అభిమానులు అయితే కోరుకుంటున్నారు. అందం, అభినయం ఉన్నప్పటికీ కూడా తెలుగులో అవకాశాలు ఎందుకు రావడం లేదో తెలియదు అంటూ అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. అది పాన్ ఇండియా లేవల్లో సినిమాలలో కూడా నటిస్తుందేమో చూడాలి కళ్యాణి ప్రియదర్శన్.