టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కొంతమంది హీరోయిన్లు మాత్రమే వారి నటన, అందంతో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. అలాంటి వారిలో నటి కీర్తి సురేష్ ఒకరు. ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం తెలుగులో వరుసగా సినిమాలు చేసుకుంటూ అగ్ర హీరోయిన్ గా తన హవాను కొనసాగించింది.


దాదాపు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరి సరసన ఆడి పాడింది. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతోంది. ఈ చిన్నది నేషనల్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. కాగా, కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వగా తనకు కాస్త నిరాశ మిగిలిందని చెప్పవచ్చు. అట్లీ దర్శకత్వం వహించిన తమిళ బ్లాక్ బస్టర్ "తెరి" ఆధారంగా తెరకెక్కిన హిందీ చిత్రం బేబీ జాన్.


సినిమా ద్వారా కీర్తి సురేష్ హిందీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఇందులో ఈ బ్యూటీకి వన్ ఆఫ్ ది లీడ్ పాత్ర అయినప్పటికీ సినిమా ఫెయిల్యూర్ తో పాటు ఆమె నటనకు కూడా విమర్శలు వచ్చాయి. కాగా ఈ సినిమాతో డిజాస్టర్ అందుకున్న అనంతరం కీర్తి సురేష్ కి హిందీలో మరో సినిమాలో అవకాశం వచ్చింది. ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో కీర్తి సురేష్ కలిసి నటించే అవకాశాన్ని అందుకుంది.

ఇది ఫైనల్ అనౌన్స్మెంట్ కాకపోయినప్పటికీ ఇందుకు సంబంధించి బాలీవుడ్ వర్గాల్లో అనేక రకాల చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చిన్న దానికి బాలీవుడ్ లో మరో సినిమాలో అవకాశం రావడంతో తన అభిమానులు సంతోషపడుతున్నారు. ఇక కీర్తి సురేష్ ఈ సినిమాతో నైనా మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాను.

మరింత సమాచారం తెలుసుకోండి: