
సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా అంతగా హిట్ కాలేదు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ పై భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా ఆడుతుంది. ఈ మూవీ మార్చి 7న జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో హిందీ వెర్షన్ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ 250 మిలియన్ మినిట్స్ కు పైగా వ్యూస్ సాధించినట్లు ఓ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. ఇక ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది.
ఈ మధ్య థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో సమానంగా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల మీద కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రతి వారం థియేటర్లలో, ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఓటీటీలు వచ్చినప్పటినుండి చాలా మంది థియేటర్ కి వెళ్లి సినిమాలు చూడడం మానేశారు.